సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తమ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే.. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా.. గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లిలో ఆయన తరుఫున కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండని జనాలను కోరారు. కూకట్పల్లిలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఊపే పార్లమెంటు ఎన్నికల్లో ఉందని పేర్కొన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి అంటే పార్లమెంట్కి.. 10 నుండి 12 సీట్లు గెలిపిస్తే ఆరు నెలల్లో సాధ్యమౌతుందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, హైదరాబాద్లో నాలుగు సార్లు కరెంటు పోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రావడం కాదు.. ఉన్నా పరిశ్రమలు పోతున్నాయన్నారు.
Yarlagadda Venkat Rao: గన్నవరంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా..
మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ అభ్యర్థి.. బడే భాయ్, బడే మోసం.. చోటే భాయ్.. చోటే మోసం అని విమర్శించారు. మరోవైపు.. మూసీకి వరదలు వస్తే బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. మతం పేరుతో దేవుళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆయన చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజలు 16 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన నగర వాసులను మరిచిపోమని కేటీఆర్ తెలిపారు.