లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పేసర్ మయాంక్ యాదవ్ గాయం తిరగబడినట్లు సమాచారం. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయన 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆయన కోటాను నవీన్ ఉల్ హక్ పూర్తి చేశారు. మయాంక్ పూర్తిగా కోలుకోకుండానే ముంబైతో మ్యా్చ్లో ఆడించినట్లు క్రీడా నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే గాయం తిరగబెట్టిందని భావిస్తున్నారు.
తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి విజ్ఞప్తి అంటూ కాపు బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే కొన్ని సవరణలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రతిపాదించిన పెన్షన్ల వయోపరిమితి 50 సంవత్సరాలు అర్హులైన అన్ని కులాలకు వర్తింపజేయాలని కోరారు. బీసీలకు మాత్రమే ప్రతిపాదించిన రూ. 4 వేల పెన్షన్ అర్హులైన అన్ని కులాలకు వర్తింప చేయాలన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. లక్నో.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో మార్కస్ స్టోయినీస్ (62) పరుగులు చేసి మరోసారి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఫైరయ్యారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, తనకు చేవెళ్ళలో పోటీ ఉంటుందని.. తాను బాధ్యతాయుతమైన నేత అని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. బాలాపూర్, బడంగ్పేట్, సరూర్నగర్ సీఎం రేవంత్ రోడ్ షోలో రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏనాడైనా కొండా చేవెళ్ళ ప్రజలతో కలిశారా? వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారా? అని ప్రశ్నించారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ జై కొడుతోందని..…
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ గురించి తెలిసి కూడా జనతాదళ్ (సెక్యులర్)తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై డీకే శివకుమార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లు చెలరేగడంతో ముంబై తక్కువ రన్స్ చేసింది. ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్.. నేహల్ వద్వేరా, టిమ్ డేవిడ్ ఆచితూచి ఆడటంతో ఓ మోస్తారు స్కోరును చేయగలిగింది.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి అంబర్ పేట్ డివిజన్లోని న్యూ పటేల్ నగర్, నరేంద్ర నగర్, చెన్నారెడ్డి నగర్, సి బ్లాక్, రఘునాథ్ నగర్ కాలనీలలో పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు.
బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ 400కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనుకుంటోందని.. అది పేదల సంక్షేమం కోసం కాదని అన్నారు. వారి హక్కులను హరించేందుకేనని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి వర్గం మెజారిటీ దిశగా పయనిస్తోందని.. అది గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ నిరుత్సాహానికి గురయ్యారని తెలిపారు. అందుకే ‘మంగళసూత్రం’, ‘హిందూ’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. మరోవైపు.. రెండు టీమ్ లు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.