బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలు విరిగిందని ఆస్పత్రికి వచ్చిన యువకుడికి వైద్యులు మాములు వైద్యం చేయలేదు. విరిగిన కాలుకు ప్లాస్టర్‌కు బదులు అట్టపెట్టను కట్టి చికిత్స చేశారు. ఈ ఘటన మినపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.
అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. కారు మహిళా పారిశుధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈరోజు ఉదయం.. గురుగ్రామ్‌లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు భారత్-అమెరికా మధ్య మ్యా్చ్ జరుగుతుంది. న్యూయార్క్లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో అమెరికా తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు పరుగులు చేయనీయకుండా కట్టడి చేశారు. భారత్ ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది అమెరికా. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. సూపర్-8లోకి ఎంట్రీ ఇస్తుంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నోట్లో కాగితాలు కుక్కి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన థానే జిల్లా సహపూర్ తాలూకా పరిధిలోని కసర ప్రాంతంలోని వశాల వద్ద సోమవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. ఘటన జరిగిన సమయంలో 59 ఏళ్ల నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు…
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ఇండియా-అమెరికా జట్ల మధ్య మ్యా్చ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. టీమిండియా సూపర్-8లోకి ఎంటర్ కానుంది.
నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం పిచ్‌పై మొదటి నుంచి చర్చ జరుగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్ ఇక్కడ ఉపయోగించబడింది. ప్రారంభంలో మ్యాచ్‌లు ఆడినప్పుడు.. అపరిమిత బౌన్స్ కారణంగా ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే కాలక్రమేణా పిచ్ మెరుగుపడింది. అయితే ఈ పిచ్ ఇప్పటికీ బౌలర్లకు సహాయకరంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బౌలర్లకు ఇక్కడ చక్కటి సహకారం లభిస్తున్నందున భారత్-అమెరికా మ్యాచ్‌లోనూ బౌలర్ల ఆధిపత్యం కనిపించనుంది.
బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు.. టీ20 ఆల్ రౌండర్‌గా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అజేయంగా నిలిచింది. గ్రూప్ 'సి' పోరులో ఉగాండా, న్యూజిలాండ్‌లను ఓడించింది. నబీ బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీ20 ఆల్ రౌండర్‌గా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. గయానాలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్లో…
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. జూన్ 1 నుంచి ప్రారంభమైన వర్షాల ప్రభావంతో.. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి చెందారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక సర్వే నివేదిక ప్రకారం.. గత రెండు రోజుల్లో పర్భానీ, హింగోలి జిల్లాల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి.
పంజాబ్‌లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫగ్వారాలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈరోజు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి.