Criminal Arrest: పోలీసుల ప్లాన్ మాములుగా లేదు కదా.. చిక్కిన పదేళ్ల నేరస్థుడు
- దశాబ్దం పాటు అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఓ కానిస్టేబుల్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సృష్టించి నేరస్థుడితో పరిచయం
- పక్కా ప్లాన్ తో పట్టకున్న ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక దశాబ్దం పాటు అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వేసిన హనీ ట్రాప్‌లో పడ్డాడు. ఒక మేల్ కానిస్టేబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మహిళగా నేరస్థుడికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో నేరస్థుడు చిక్కినట్లు పోలీసులు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో దొంగతనం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం.. బూట్‌లెగ్గింగ్ వంటి 20 కేసులు నిందితుడు బంటి (45)పై ఉన్నాయి. అయితే అతన్ని ఆకర్షించడానికి ఓ కానిస్టేబుల్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సృష్టించాడు.
SSMB29 : మహేష్, రాజమౌళి మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
నిందితుడిపై 2013లోనే సిటీ కోర్టు ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు. అయితే.. పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం ఎంత ప్రయత్నించినా చిక్కలేదు. కాగా.. నేరస్థుడు బంటి ఇందిరా వికాస్ కాలనీలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే.. నేరస్థుడు ఇన్‌స్టాగ్రామ్ ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఓంపర్కాష్ డాగర్ ఒక వినూత్న ఆలోచనతో వచ్చాడని డిసిపి చెప్పారు.
AP Crime: లవ్ ఫెయిల్.. ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య..
కానిస్టేబుల్ ఒక మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సృష్టించాడని డీసీపీ తెలిపారు. “కానిస్టేబులో బంటితో చాట్ చేయడం ప్రారంభించాడు.. నేరస్తుడు కూడా ఇన్ స్టాలో బాగానే పరిచయమయ్యాడు” అని డిసిపి చెప్పారు. ఆ తర్వాత.. పంజాబీ బాగ్ మెట్రో స్టేషన్‌లో ‘ఫేక్ మహిళ’ని కలవడానికి బంటి అంగీకరించాడు. జూన్ 7వ తేదీన వారిద్దరూ కలిసేందుకు సిద్ధమవ్వగా.. అక్కడే చాటుగా ఉన్న పోలీసులు పక్కా ప్లాన్ తో నేరస్తుడిని పట్టుకున్నారు. నేరస్థుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన చిరునామా, ఫోన్ నంబర్లను క్రమం తప్పకుండా మార్చేవాడని డీసీపీ తెలిపారు.
తాజావార్తలు
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!