ఇటలీలోని అపులియాలో జీ-7 సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాదిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం. ఈ సమావేశం అనంతరం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కూడా ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో సమావేశమయ్యారు. కాగా.. జీ7 సమ్మిట్ ఔట్రీచ్ సెషన్‌లో పాల్గొనడానికి ప్రధాని మోడీ ఈరోజు ముందుగానే ఇటలీలోని అపులియా చేరుకున్నారు. శుక్రవారం కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులను కలవనున్నారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానికి ఇదే తొలి విదేశీ పర్యటన.
Read Also: Kuwait Fire: అగ్నిప్రమాదం కేసులో ముగ్గురు అరెస్ట్
ఇదిలా ఉంటే.. జీ7 సదస్సుకు మోడీతో సహా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరయ్యారు. రెండ్రోజుల పాటు మోడీ ఇటలీలో పర్యటించనున్నారు. సదస్సులో భాగంగా.. అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాధినేతలతో పాటు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అబుధాబి రాజు షేక్ మోహమ్మద్ బిన్ జాయద్, మరి కొందరు అరబ్ రాజకుటుంబీకులను మోడీ కలువనున్నారు.
Read Also: Dolly Chaiwala: హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన డాలీ చాయ్‌వాలా.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం.. (వీడియో)