రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు నిలిచిపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణమైంది. విద్యుత్ కోత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో తాము చాలా అసౌకర్యానికి గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. డిజి యాత్ర, చెక్‌ఇన్ కౌంటర్లు ఆగిపోయాయి. ఈ క్రమంలో.. ఒక వినియోగదారు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు, 'విద్యుత్ వైఫల్యం కారణంగా, ఢిల్లీ విమానాశ్రయం T3 పూర్తిగా చీకటిగా…
ఏడాది కాలంగా జాతి హింసకు గురవుతున్న మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించనున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. అందుకోసమని.. ఆదివారం రోజున మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే సమీక్ష కోసం వచ్చారు. ఈ క్రమంలో.. ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు.
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ (MJPJAY)ని ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం వార్షిక ప్రీమియంను 60% పెంచి రూ.3,000 కోట్లకు పైగా పెంచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద.. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 1.5 లక్షలకు బదులుగా మొత్తం రూ.5 లక్షల…
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మరణించారు. అంతేకాకుండా.. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కాగా.. ఈ రైలు ప్రమాద ఘటనపై ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ యాదవ్ ప్రశ్నలు సంధించారు.
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్‌లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలులోని గార్డు మరణించారు.
ప్రయాణికుడి భోజనంలో 'మెటల్ బ్లేడ్' వచ్చినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూన్ 9న AI 175 విమానం బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా దర్యాప్తు చేస్తోంది. ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. "ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్‌లో బ్లేడ్ కనిపించిదని పాల్ పేర్కొన్నాడు. అయితే.. తన కోసం ఫుడ్ రాగానే దానిని చూడకుండా.. రెండు…
కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ అంశంపై కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరలు నేరుగా ఇతర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయని.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయాలు…
ఉత్తరాఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురిని బలి తీసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 19 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు మూడు కార్లు పౌరీలో లోతైన లోయలో పడిపోయాయి. కాగా, శనివారం రుద్రప్రయాగ్‌లోని అలకనంద నదిలో టెంపో ట్రావెలర్ పడిపోవడంతో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు. హల్ద్వానీలో కూడా ఓ కారు…
ఈద్-ఉల్-అజా పండుగ సందర్భంగా.. సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. అయితే.. సౌదీ అరేబియాలో తీవ్రమైన ఎండలు, వేడితో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హజ్ సమయంలో 47 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. మక్కాలో విపరీతమైన వేడిమి కారణంగా ఆరుగురు మరణించారు.
టెక్సాస్లో ఓ ముష్కరుడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. శనివారం సాయంత్రం టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయలయ్యాయి. జునెటీన్త్ పండుగ సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ముష్కరుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారని CNN నివేదించింది. గాయపడిన వారందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.