ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో చించ్‌పాడ ప్రాంతంలో జరిగింది. అయితే.. మహిళపై దాడి చేస్తుండగా చాలా మంది ఘటన స్థలంలో ఉన్నప్పటికీ, ఎవరూ ఆపడానికి సాహసించలేదు.. అలానే చూస్తూ ఉండిపోయారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన ఆరోపణపై చర్చించడానికి రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం ఇండియా కూటమి నేతలను కోరారు. ఈ క్రమంలో కూటమి నేతలకు లేఖ రాశారు. ఆ లేఖలో.. తనపై దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అవమానించడం, హత్యకు ప్లాన్ చేశారని లేఖలో పేర్కొంది. "నా పాత్రపై ఎడతెగని దాడులను ఎదుర్కొన్నాను.. అంతేకాకుండా.. నా స్వంత పార్టీ నాయకులు, వాలంటీర్లు.. నా ప్రతిష్ట, పాత్ర, విశ్వసనీయతను అణగదొక్కడానికి ఒక స్మెర్ ప్రచారం నిర్వహించారు." అని మలివాల్…
యూపీలోని ఎటాలో జరిగిన దాడిలో సాక్షిగా తీసుకొచ్చిన నడివయస్కుడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సోమవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ క్రమంలో.. కొత్వాలి ఇన్‌చార్జి నిధౌలీ కలాన్, మున్షీలను ఎస్‌ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. ఎండ వేడిమి కారణంగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన నిధౌలి కలాన్ పోలీస్ స్టేషన్‌లోని జరిగింది.
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్ పీటీఐకి తెలిపారు.
రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వయనాడ్, రాయబరేలి స్థానాల నుంచి పోటీ చేయగా.. రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో.. ఏ స్థానంలో ఉండాలి.. ఏ స్థానాన్ని వదులేసుకోవాలనే దానిపై సందిగ్థత ఉండేది. తాజాగా.. వయనాడ్ స్థానాన్ని…
డ్రైవర్ లేకుండానే మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా.. దేశ రాజధాని ఢిల్లీలోని మెజెంటా లైన్ మార్గంలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు నడవనుంది. జూలై 1 నుండి ఇది ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. జూలై నెలలో మెజెంటా లైన్ లో కనపడరని DMRC తెలిపింది.
రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలను చూసి లోక్ పైలట్ అప్రమత్తతో ట్రైన్ ఆపి వాటి ప్రాణాలను కాపాడాడు. దాదాపు 10 సింహాలు ట్రాక్ పై నిద్రిస్తుండగా.. అది చూసిన లోకో పైలట్ సడన్ గా బ్రేకులు వేశాడు. దీంతో వాటి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ సమీపంలో జరిగింది. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుండి ప్రధాన కారిడార్ పక్కన ఒక చిన్న ట్రాక్ పై వస్తున్నాడు. అయితే..…
వధువు విషయంలో కేరళలోని ఒక జిల్లా వినియోగదారుల కోర్టు మ్యాట్రిమోనీకి షాకిచ్చింది. ఒక వ్యక్తికి వధువును కనుగొనడంలో విఫలమైనందుకు మ్యాట్రిమోనీ సైట్‌ను బాధ్యులను చేయడమే కాకుండా దానికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది. అంతే కాకుండా బాధితుడి ఖర్చు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ "తప్పు నిర్వహణ"పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి "రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు", ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను 'కెమెరాతో నడిచే' స్వీయ ప్రచార వేదికగా మార్చిందని…
ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకుంటే బీజేపీ 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉండేది కాదని తెలిపారు. ముంబై నార్త్‌వెస్ట్ సీటులో తాము గెలుస్తున్నామని, ఫౌల్ ప్లే చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాన్ని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. దీనితో పాటు.. ఎన్నికల కమిషన్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ఎన్నికల కమిషన్ కాదు, 'ఈజీగా రాజీ' అని ఆరోపించారు. మరోవైపు.. ఇంతకు ముందు ఉద్ధవ్ సేన శనివారం ఎన్నికల కమిషన్‌పై…