టెక్సాస్లో ఓ ముష్కరుడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. శనివారం సాయంత్రం టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయలయ్యాయి. జునెటీన్త్ పండుగ సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ముష్కరుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారని CNN నివేదించింది. గాయపడిన వారందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
NCERT: ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో “బాబ్రీ మసీదు” పేరు తొలగింపు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సెటిలర్స్ పార్క్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కాల్పులు జరిగాయని రౌండ్ రాక్ పోలీస్ చీఫ్ అలెన్ బ్యాంక్స్ తెలిపారు. ఒక ముష్కరుడు పలువురిపై కాల్పులు జరిపాడని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు బ్యాంక్స్ తెలిపారు. చికిత్స కోసం నలుగురు పెద్ద, ఇద్దరు పిల్లలను స్థానిక ట్రామా సెంటర్‌లకు తరలించినట్లు ఆస్టిన్-ట్రావిస్ కౌంటీ స్థానిక మీడియాకు తెలిపింది. మరోవైపు.. నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Bride Kidnap: పెళ్లి కూతురుని కారులో ఎత్తుకెళ్లిన బంధువులు.. ఎందుకంటే..
శనివారం సాయంత్రం అక్కడి ప్రభుత్వం జునెటీన్త్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రదర్శనకారులు పాల్గొని అలరించారు. జునేటీన్త్ ని.. జునెటీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే అని కూడా పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం జూన్ 19న జరుపుకునే ఫెడరల్ సెలవుదినం. ఇది దేశంలో బానిసత్వ ముగింపును గుర్తుచేస్తుంది.