MJPJAY: మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఇక నుంచి ఆ పథకం అందరికీ
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పిన షిండే సర్కార్
- నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ ను
- ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ (MJPJAY)ని ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం వార్షిక ప్రీమియంను 60% పెంచి రూ.3,000 కోట్లకు పైగా పెంచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద.. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 1.5 లక్షలకు బదులుగా మొత్తం రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకాన్ని 2012లో ప్రారంభించారు.
India-Ukraine: ఉక్రెయిన్‌కు మద్దతుగా సంతకం చేయని భారత్.. కారణమేంటంటే..!
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ఈ పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఖరారు చేసింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ యునైటెడ్ ఇండియా అస్యూరెన్స్‌ను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 12.3 కోట్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1300 చొప్పున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023-24లో 5.7 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. కొత్త పథకం అమలుకు ముందు.. బీమా చేసిన వ్యక్తి దాని ప్రయోజనాలను పొందేందుకు రూ. 1 లక్ష వరకు వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం దానిని తొలగించి పౌరులందరికీ సమానంగా అమలు చేసింది. ఇప్పుడు ఆదాయానికి కూడా పరిమితి లేదు. ఈ పథకం కింద గతంలో 1000 ఆసుపత్రులను ఎంప్యానెల్ చేయగా ఇప్పుడు 1900 ఆసుపత్రులకు పెంచారు.
Vijay Sethupathi: హిట్ కొట్టగానే డైరెక్టర్ మారిపోయాడు.. 33 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు!
గత ఏడాది జూన్‌లో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎంజేపీజేఏవై (MJPJAY) బీమా మొత్తాన్ని రూ. 1.5 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. కాగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగియడంతో ప్రభుత్వం దానిని ఖరారు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ పథకం జూలై 1 నుండి కొత్త రూపంలో ప్రారంభించబడనుంది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!