ఏడాది కాలంగా జాతి హింసకు గురవుతున్న మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించనున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. అందుకోసమని.. ఆదివారం రోజున మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే సమీక్ష కోసం వచ్చారు. ఈ క్రమంలో.. ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు.
Read Also: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ పాటలు సందడి మొదలయేది అప్పుడే ..!
మణిపూర్‌లో 2023 మే 3న షెడ్యూల్డ్ తెగ హోదా కోసం.. మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర తర్వాత హింస చెలరేగింది. అప్పటి నుండి హింస కొనసాగుతూనే ఉంది. ఈ హింసలో కుకీ, మెయిటీ వర్గాలకు చెందిన 220 మందితో పాటు కొందరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తుంటారు. మరోవైపు.. నాగాలు, కుకీలను కలిగి ఉన్న గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాలలో నివసిస్తుంటారు.
Read Also: NCERT Chief: ‘భారత్’, ‘ఇండియా’లను పాఠ్యపుస్తకాల్లో పరస్పరం మార్చుకోవాలి..
మరోవైపు.. మణిపూర్ లో ఏడాది తర్వాత కూడా శాంతి లేకుండా పోవడంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కలహాలతో దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితిని ప్రాధాన్యతతో పరిగణించాలని అన్నారు. జూన్ 10న నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ ట్రైనీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా మణిపూర్ శాంతి కోసం ఎదురు చూస్తోందని.. పదేళ్ల క్రితం మణిపూర్‌లో శాంతి నెలకొందని.. అక్కడ తుపాకీ సంస్కృతి అంతమైపోయినట్లు అనిపించిందని.. కానీ రాష్ట్రంలో ఒక్కసారిగా హింస మొదలైందని తెలిపారు.