భార్య చనిపోవడంతో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్‌లో.. 'ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు. ఈరోజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు"…
సుప్రీంకోర్టులో జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు స్థాపించిన 75వ సంవత్సరంలో ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తోంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించనున్నారు. సామాన్య ప్రజలు ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్థాపన జరిగిన 75వ సంవత్సరంలో.. తగిన పెండింగ్‌లో ఉన్న కేసుల సామరస్య పరిష్కారాన్ని కనుగొనడానికి సుప్రీంకోర్టు 2024 జూలై 29 నుండి 2024 ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేస్తుంది. దేశ…
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతుంది. బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 7 పదునైన ప్రశ్నలు సంధించారు. భారతీయ రైల్వేల నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. బెంగాల్ లో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మల్లికార్జున్ ఖర్గే ఎక్స్‌లో స్పందిస్తూ.. 'రైల్వే ప్రమాదం జరిగినప్పుడల్లా, ప్రస్తుత రైల్వే మంత్రి కెమెరాలతో పకడ్బందీగా…
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. వారణాసిలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రూ.20,000 కోట్లను విడుదల చేశారు. ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు క్రిడిట్ అవుతాయి.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి సహా 10 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఈ ప్రమాదం తర్వాత రైలు ప్రయాణంలో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా.. స్వదేశీంగా రూపొందించిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశమైంది. దీనిని మూడు భారతీయ సంస్థల సహకారంతో ()ఆర్డీఎస్వో (RDSO)…
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో గవర్నర్ పదవీకాలం ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లో ఆనందీ బెన్ పటేల్, రాజస్థాన్‌లో కల్‌రాజ్ మిశ్రా, గుజరాత్‌లో ఆచార్య దేవవ్రత్, కేరళలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గవర్నర్‌ల పదవీకాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు తదుపరి గవర్నర్ ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ బన్వారీ లాల్ పురోహిత్ ఇప్పటికే తమ పదవికి రాజీనామా చేశారు.. అయితే వారి రాజీనామాను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు.
పదేళ్ల తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ తన ప్రతిపక్ష నేతను నియమించుకోనుంది. అందుకోసమని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అభ్యర్థించారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలో.. సోమవారం కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా అంగీకరించకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను బెదిరించారని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఈ విషయం రాహుల్ గాంధీ సరదాగా చెప్పారు. కాగా..…
ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో రకరకాల స్టంట్స్ చేస్తూ.. హైలెట్గా నిలుస్తున్నారు. అయితే.. యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే....