బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌లోకి ప్రవేశించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 స్కోర్ చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ.. ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చిందని చెప్పాడు. ధోనీ తనకు ఆదర్శమని అని అన్నాడు.
ఉగ్రవాదులను అంతమొందించేందుకు పోలీసులు సరికొత్త టెక్నాలజీ తీసుకురానున్నారు. రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. సహచరులను గుర్తించేందుకు, శత్రువులను కచ్చితంగా టార్గెట్ చేసేందుకు ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఐదు వేల వ్యూహాత్మక సామగ్రిని పోలీసులు కొనుగోలు చేయనున్నారు. ఇందులో వెయ్యి ఇన్‌ఫ్రారెడ్ లైట్ లేజర్‌లు, 4 వేల ఇన్‌ఫ్రారెడ్ ప్యాచ్‌లు ఉన్నాయి. ఇన్‌ఫ్రారెడ్ లేజర్ రాత్రిపూట 800 మీటర్ల దూరం వరకు శత్రువును చూస్తుంది.
వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులలో చేరుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతుంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) డేటా ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 30 వరకు 246 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళను ఆమె భర్త సజీవ దహనం చేశాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో.. ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహవల్‌నగర్‌కు చెందిన సబా ఇక్బాల్‌ను.. భర్త అలీ రజా హత్య చేశాడు. సబా, రజా ఎనిమిది నెలల క్రితం కోర్టు వివాహం చేసుకున్నారు.
శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది.
ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే నెలలో ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఈ నియమాలు వినియోగదారులను.. పెట్టుబడిదారులను ఒకే విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులు పన్నులు, బ్యాంకింగ్ ఛార్జీలు, పెట్టుబడి ఎంపికలు.. సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి జరిగే మార్పులేంటో తెలుసుకుందాం.
మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ మ్యాచ్‌లో దీపిక 6-2తో నెదర్లాండ్స్‌కు చెందిన క్వింటీ రోఫెన్‌ను ఓడించింది. దీపిక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది. క్వింటిపై దీపిక 2-0తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. దీపిక తొలి సెట్‌లో 29 పాయింట్లు సాధించగా.. నెదర్లాండ్స్‌కు చెందిన ఆమె ప్రత్యర్థి 28 పాయింట్లు చేసింది.
కేరళలోని వయనాడ్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 204కి చేరింది. అలాగే.. 31 మంది తమిళనాడు చెందిన వారు మిస్సింగ్ కాగా.. 1592 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మరోవైపు.. మట్టి కింద మానవ ఉనికిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే.. ఈ ప్రకృతి విధ్వంసం జరిగిన సమయంలో ఓ వ్యక్తి తన కళ్లతో చూసిన విషయాలను తెలిపాడు.
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా.. భారత ఆటగాళ్లు కొందరు సత్తా చాటుతుంటే.. మరికొందరు ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే భారత్ రెండు కాంస్య పతకాలు సాధించింది. మరి కొందరు ఆటగాళ్లు సెమీ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. బుధవారం జరిగిన ఒలింపిక్స్ రౌండప్ ఎలా ఉందో తెలుసుకుందాం.
మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 4-2తో జియాన్ జెంగ్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 51 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆకుల 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో విజయం సాధించాది. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఒలింపిక్స్‌లో చివరి-16 రౌండ్‌కు చేరిన రెండో మహిళా క్రీడాకారిణిగా శ్రీజ నిలిచింది. భారత మహిళా బాక్సర్ లోవ్లినా మహిళల 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన…