మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ మ్యాచ్‌లో దీపిక 6-2తో నెదర్లాండ్స్‌కు చెందిన క్వింటీ రోఫెన్‌ను ఓడించింది. క్వింటిపై దీపిక 2-0తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. దీపిక తొలి సెట్‌లో 29 పాయింట్లు సాధించగా.. నెదర్లాండ్స్‌కు చెందిన ఆమె ప్రత్యర్థి 28 పాయింట్లు చేసింది.
Read Also: Goa: గోవాలో మద్యాన్ని నిషేధించాలి.. ఎమ్మెల్యే డిమాండ్..
తొలి సెట్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన దీపిక 27-29 స్కోరుతో క్వింటి చేతిలో రెండో సెట్‌ను కోల్పోయింది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య మ్యాచ్ 2-2తో సాగింది. అయితే, దీపిక మూడో సెట్‌లో పుంజుకుని 4-2తో ఆధిక్యంలో నిలిచింది. అప్పటికి.. దీపిక 25 పాయింట్లు సాధించగా, క్వింటీ 17 పాయింట్లు చేసింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ క్రీడాకారిణి మొదటి షాట్‌ను బయట ఆడడంతో ఆమెకు పాయింట్ రాలేదు. దీంతో తర్వాతి సెట్‌లో దీపిక ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సులువైన విజయాన్ని నమోదు చేసింది. దీపిక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది. అందులో దీపిక ప్రత్యర్థి జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్ తో తలపడనుంది.
Read Also: Wayanad Landslide: ప్రకృతి విధ్వంసాన్ని తన కళ్లతో చూసిన వ్యక్తి.. ఏం చెప్పాడంటే..?