పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళను ఆమె భర్త సజీవ దహనం చేశాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో.. ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహవల్‌నగర్‌కు చెందిన సబా ఇక్బాల్‌ను.. భర్త అలీ రజా హత్య చేశాడు. సబా, రజా ఎనిమిది నెలల క్రితం కోర్టు వివాహం చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన తర్వాత తన భార్య సబా వేరొకరితో సంబంధం పెట్టుకుందని రజా అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. సబా భర్తతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని భర్త రజా జూలై 28న ఫోన్‌లో చెప్పినట్లు సబా తండ్రి మహ్మద్ ఇక్బాల్ తెలిపారు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది.
Mystery Behind the Bullets in Narsingi: నార్సింగిలో కలకలం.. బుల్లెట్ల వెనుక మిస్టరీ ఏంటి…?
దీంతో.. సబా కోసం తన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. అయితే.. ఒక పొలంలో సబా కాలిపోయిన మృతదేహం పడి ఉన్నట్లు సబా కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఈ విషయమై వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. మహిళ భర్త రజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మొదట సబాను కొట్టి, ఆపై కాల్చివేసినట్లు విచారణలో రజా పోలీసులకు చెప్పాడు. కాలిన మృతదేహాన్ని పొలంలో పడేసినట్లు తెలిపాడు. ఈ కేసులో పోలీసులు రజాతో పాటు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశారు.
Karnataka Health Minister: జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే
ఇటీవల పాకిస్తాన్‌లో తన భర్త కొట్టిన కారణంగా విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసినప్పుడు కోపోద్రిక్తుడైన మామ మహిళ కాళ్ళను నరికేశాడు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుల్ టౌన్‌లో నివాసం ఉండే సోబియా, బటూల్ షా.. తన భర్త రోజూ కొట్టేవాడని తెలిపింది. ఇంతకుముందు.. తనకు, భర్తకు మధ్య ఒక గొడవ జరిగిందని, ఆ విషయంలో ఆమె తన భర్తను చాలాసార్లు ఒప్పించే ప్రయత్నం చేసింది.. కానీ భర్త అంగీకరించలేదు. ఈ క్రమంలో భర్త దురుసు ప్రవర్తన గురించి ఆ మహిళ తల్లిదండ్రులకు తెలిపింది. ఎక్కడి నుంచి ఎలాంటి ఆశ కనిపించకపోవడంతో ఆ మహిళ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ మహిళ విడాకుల కోసం దాఖలు చేయడంతో కుటుంబ పరువు పోయిందని.. ఆగ్రహించిన ఆమె మామ గొడ్డలితో సోబియా ఇంటికి చేరుకున్నారు. అనంతరం.. తన కాళ్లను గొడ్డలితో నరికి వెళ్లినట్లు సోబియా చెప్పింది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.