మీరు కొత్త కారుని కొనుగోలు చేస్తే.. దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సర్వీసింగ్ అనేది అవసరం. మీరు కారును సరిగ్గా నిర్వహించకపోతే దాని పనితీరు తగ్గుతుంది. ఈ క్రమంలో.. కారు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా మంది కార్ డ్రైవర్‌లు తమ కారును సమయానికి సర్వీస్ చేయడం చాలా అరుదు. మీరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే.. మానుకోండి. తద్వారా కారు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడదు.
ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్ల గురించి తెలుసుకుంటున్నారు. ఈ 'OS' ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్‌లో ఇటువంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నప్పటికి.. వాటి గురించి యూజర్స్కు పూర్తిగా తెలియదు. అందులో అలాంటి ఒక ఫీచర్ కూడా ఉంది.. అదే 'ఆండ్రాయిడ్ రికవరీ మోడ్'. ఈ ఫీచర్ ద్వారా చాలా పనులు చేసుకోవచ్చు. ఇంతకీ.. ఆండ్రాయిడ్ రికవరీ మోడ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..?ఆండ్రాయిడ్ రికవరీ మోడ్ ఫీచర్ ద్వారా ఫోన్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించవచ్చు.
బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత ఆటగాడు పతకం సాధించడంలో దగ్గర్లో ఉన్నారు. 50 మీటర్ రైఫిల్ 3 పాజిషన్స్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశలో సింధు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు
కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు.
పారిస్ ఒలింపిక్స్లో ఈరోజు (మంగళవారం) భారత్ను మరో పతకం వరించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను, సరబ్‌జోత్‌లు కాంస్య పతకాన్ని గెలిచి.. భారత్‌కు రెండో పతకాన్ని అందించారు. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను బాకర్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.. మహిళల వ్యక్తిగత ఆర్చరీ రౌండ్ ఆఫ్ 16 ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. భజన్ కౌర్ 7-3తో ఇండోనేషియాకు చెందిన సైఫాను ఓడించింది.
2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం రూ.48.21 లక్షల కోట్ల బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. దిగువ సభ కూడా మూజువాణి ఓటు ద్వారా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను ఆమోదించింది. వీటికి సంబంధించిన విభజన బిల్లును కూడా సభ ఆమోదించింది. బడ్జెట్ చర్చకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 2024-25 మధ్యకాలంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.9 శాతానికి, 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. 2047 నాటికి అభివృద్ధి చెందిన…
వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు.. చిన్హే భారత పర్యటనలో ఉంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక చర్చలపై చర్చించనున్నారు.