2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లోక్‌సభలో తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3,012 లక్షల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌లను 99 దేశాలకు, రెండు UN సంస్థలకు పంపిందని ఆయన చెప్పారు. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత సరఫరా కింద కోవిడ్ వ్యాక్సిన్‌ల కొనుగోలు కోసం సుమారు రూ. 36 వేల 398 కోట్లు…
భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.
భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయడంతో తక్కువ స్కోరు చేయగలిగింది. దీంతో భారత్ ముందు శ్రీలంక స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.
యూపీ రాష్ట్రం ఘాజీపూర్‌లోని వీర్‌పూర్ గ్రామంలో శుక్రవారం విషాదం చేటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మృతదేహాన్ని చూసిన కొంతసేపటికి భర్త కూడా షాక్‌కు గురై గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారులు, కుమార్తెల రోదనలతో గ్రామస్తుల కంట కన్నీరు మున్నీరైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
భారత స్టార్ షూటర్ మను భాకర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. శుక్రవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి ఇషా సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇషా క్వాలిఫికేషన్‌లో 18వ స్థానంలో నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఐదు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇతర సివిల్ ఏజెన్సీ ఉద్యోగుల సహాయంతో శిథిలాలను తొలగించడం ప్రారంభించారు. శిథిలాల నుంచి నలుగురిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో ముగ్గురు తల్లులు పతకాలు సాధించారు. బ్రిటన్‌కు చెందిన వెటరన్ హెలెన్ గ్లోవర్.. న్యూజిలాండ్ క్రీడాకారిణులు లూసీ స్పూర్స్, బ్రూక్ ఫ్రాన్సిస్‌లు ఉన్నారు. మహిళల డబుల్ స్కల్స్‌లో స్పూర్స్.. ఫ్రాన్సిస్ బంగారు పతకాన్ని గెలుచుకోగా, మహిళల ఫోర్‌లో ముగ్గురు పిల్లల తల్లి గ్లోవర్ రజతం సాధించింది. కాగా.. స్పూర్స్, ఫ్రాన్సిస్ తమ ఆట ముగిసిన అనంతరం లైన్ దాటి.. తమ బిడ్డలను కౌగిలించుకోవడానికి స్టాండ్‌లలోకి వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రోహిత్ భారత క్రికెట్ అభిమానులందరికీ ప్రత్యేకమైన, భావోద్వేగ సందేశాన్ని ఇచ్చాడు. బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియో కొన్ని వారాల క్రితం అభిమానులు.. ఆటగాళ్లు పంచుకున్న అన్ని చిరస్మరణీయ క్షణాలను సంగ్రహించింది. బార్బడోస్‌లో రోహిత్ కెప్టెన్సీ షూట్ నుండి మెరైన్ డ్రైవ్ దగ్గర విజయ పరేడ్.. వాంఖడే స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన సన్మాన కార్యక్రమం వరకు ఈ వీడియోలో చూపిస్తుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల 3-పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. అతను సాధించిన ఈ ప్రత్యేక విజయానికి సెంట్రల్ రైల్వే బహుమతి ఇచ్చింది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో కుసాలే ఏడో స్థానంలో నిలిచాడు.