పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.
నిపా వైరస్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. నిపా, కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయని ఆయన అన్నారు. జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయని చెప్పారు. అటువంటి ఉద్భవిస్తున్న వ్యాధులను ఎదుర్కోవటానికి.. మానవ, జంతువు.. పర్యావరణ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం విషయంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వెజ్‌కి బదులు నాన్‌వెజ్ ఫుడ్ ఇవ్వడంతో ఓ ప్రయాణికుడు వెయిటర్‌పై చిరుబుర్రులాడాడు. అంతేకాకుండా.. కోపంతో వెయిటర్‌ని ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టాడు.
జార్ఖండ్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో హౌరా- ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. మూడు బోగీలు చెల్లాచెదురై పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. అయితే.. అదే ట్రాక్ పై వచ్చిన హౌరా-ముంబై రైలు ఆ బోగీలను ఢీకొట్టగా మొత్తం 18 ప్యాసింజర్ ట్రైన్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
వయనాడ్‌లో రుతుపవన వర్షాల కారణంగా సంభవించిన పలు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ దాదాపు 88 మంది మరణించారు. 116 మంది తీవ్ర గాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం కాపాడారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు.
భారీ వర్షాల మధ్య కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 70 మంది మరణించారు. అంతేకాకుండా.. 116 మంది గాయపడ్డారు. కొండచరియల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు.
ఇటీవల పదోన్నతి పొందిన 30 వేల మంది ఉపాధ్యాయులతో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సాయంత్రం సంబంధిత ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.