Swapnil-MS Dhoni: ధోనీ నాకు ఆదర్శం.. స్టార్ షూటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే
- ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నాను- స్వప్నిల్
- ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చింది
- ధోనీ ఒకప్పుడు టికెట్ కలెక్టర్.. నేను కూడా అదే- స్వప్నిల్ కుసాలే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌లోకి ప్రవేశించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 590 స్కోర్ చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ.. ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చిందని చెప్పాడు. ధోనీ తనకు ఆదర్శమని అని అన్నాడు. స్వప్నిల్ రేపు పతకం కోసం పోటీలో పాల్గొననున్నాడు. రేపు ఫైనల్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీలో షూటర్లు మూడు స్థానాల్లో గురి పెట్టాలి. వీటిలో వంగి/కూర్చున్నప్పుడు, పడుకుని, నిలబడి గురి పెట్టాలి.
Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. 10 విమానాల దారి మళ్లింపు
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని కంబల్‌వాడి గ్రామానికి చెందిన 29 ఏళ్ల కుసాలే.. 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో ఆడుతున్నప్పటికీ ఒలింపిక్ అరంగేట్రం కోసం 12 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో.. అతను ప్రశాంతంగా ఉండటానికి ధోని సినిమాను చాలాసార్లు చూశానని చెప్పాడు. ధోనీలాగే తాను కూడా టిక్కెట్ కలెక్టర్ అని కుసలే చెప్పాడు. తాను షూటింగ్‌లో ఏ ఆటగాడి నుండి సలహాలు తీసుకోనని.. కానీ ఇతర క్రీడలలో ధోనీ తనకు ఇష్టమైన ఆటగాడు అని తెలిపాడు. తన ఆటకు కూడా ప్రశాంతత అవసరం.. ధోనీ కూడా మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారని.. అతను కూడా ఒకప్పుడు టికెట్ కలెక్టర్.. తాను కూడా అదేనని అన్నాడు.
Terror Attack: ఉగ్రవాదులను అంతమొందించే సరికొత్త టెక్నాలజీ..!
కుసలే 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నారు. అతని తండ్రి, సోదరుడు జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తల్లి గ్రామ సర్పంచ్. తన ప్రదర్శనపై ఇప్పటి వరకు అనుభవం చాలా బాగుందన్నాడు. తనకు షూటింగ్ అంటే చాలా ఇష్టమని.. మను భాకర్‌ని చూడగానే తనకు ఆత్మవిశ్వాసం వచ్చిందని తెలిపాడు. ఆమె గెలవగలిగితే తాను కూడా గెలవగలనని చెప్పాడు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!