ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 'యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని అన్నారు. తాము యుద్ధానికి దూరంగా ఉన్నాము.. భారత్ మొదటి రోజు నుండి పక్షపాతం కలిగి ఉంది. మా వైపు శాంతి ఉంది, మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి మేము వచ్చాము.' అని ఉక్రెయిన్ అధ్యక్షుడితో చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళల కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. బురఖా ధరించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై కొత్త ఆంక్షలు విధించారు. ఈ చట్టాలకు తాలిబాన్ అగ్రనేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదం తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్‌ఐఆర్‌లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్‌లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ ప్రకటించిన షెడ్యూల్‌లో మొదటి టెస్ట్ 6 రోజుల్లో ఆడనున్నట్లు ఉంది. సాధారణంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగుతుంది. కానీ.. ఈ టెస్ట్ మ్యాచ్ ఆరు రోజులు జరగనుంది. అందుకు కారణమేంటంటే.. గాలెలో జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ సమయంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు నమోదైంది.
ఫేస్‌బుక్ లైవ్ చేస్తూ మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్నోలో జరిగింది. ఆమె సివిల్ కోర్టు మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునడాన్ని చూసి లాయర్లు కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఆమె కోర్టు భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను బలరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కోల్‌కతా అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. నేరం చేయడానికి ఒక రోజు ముందు ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో.. ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. 33 మంది వ్యక్తులు బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను…
కోల్‌కతా మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును శుక్రవారం సీల్దా కోర్టులో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. నిందితుడు సంజయ్ రాయ్‌ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్‌లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే.
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్ చేశారు.
కష్టతరమైన వెన్నెముక శస్త్ర చికిత్సలకు అత్యాధునిక పరిష్కారాలను అందిస్తూ.. స్టార్ హాస్పిటల్స్ సగర్వంగా తన అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ నూతన సదుపాయం రోగులకు అధునాతన వెన్నెముక శస్త్రచికిత్సలను డే-కేర్ విధానాలుగా చేయగలుగుతుంది. దీని ద్వారా అధిక-రిస్క్ ఉన్నవారికి మరియు వృద్ధ రోగులకు ఉపయోగంగా కొన్ని రోజుల్లోనే కోలుకోవచ్చు.