వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ రైళ్ల విజయవంతమైన తర్వాత.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు.
టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయరు నికోలస్ పూరన్ నిలిచాడు. అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్‌లను వెనక్కి నెట్టి పూరన్ మూడో స్థానానికి ఎగబాకాడు.
16 మంది సభ్యులలో 15 మంది అతనికి మద్దతు ఇవ్వడంతో జైషా తదుపరి ఐసీసీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐసీసీలో చేరితే అతడి స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమిస్తారనే దానిపై స్పష్టత లేదు. అధికారిక నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ కాబట్టి.. జైషా నిర్ణయం తీసుకోవడానికి 96 గంటల కంటే తక్కువ సమయం ఉంది. కాగా.. ఐసీసీ కొత్త చైర్మన్ డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం ఉదయం ఓ ఎన్నారై ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎన్నారైపై రెండుసార్లు కాల్పులు జరిపారు. బాధితుడు 43 ఏళ్ల సుఖ్‌చైన్ సింగ్‌గా గుర్తించారు.
రష్యాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు జైలు ఉద్యోగులు కూడా ఉన్నారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన ఐకే-19 సురోవికినో శిక్షాస్మృతి కాలనీలో ఈ హింసాకాండ చోటుచేసుకుంది.
నోయిడాలో పోలీసులు కాల్పులు చేపట్టారు. అనంతరం నోయిడా పోలీసులు నలుగురు దుండగులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదుతోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దుండగులపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దుండగులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మదర్సాలో మతగురువు (మౌల్వీ) దారుణానికి ఒడి గట్టాడు. ఐదుగురు బాలికలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ శారీరక దోపిడీకి పాల్పడ్డాడు. మౌల్వీ చేసిన ఈ నీచమైన చర్యను ఐదుగురు బాలికలు బయటపెట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వారే కాకుండా.. ఇతర అమ్మాయిలతో కూడా అసభ్యంగా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇతర బాలికల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో ఇరు జట్లు ఒకే స్కోరును చేస్తే.. ఆ మ్యాచ్ టై అవుతుంది. మళ్లీ తిరిగి సూపర్ ఓవర్ పెడుతారు. అలా.. ఒకే మ్యాచ్లో మూడుసార్లు టై అయింది. ఇంతకీ ఎక్కడా.. ఏ మ్యాచ్ అనుకుంటున్నారా..?. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా జరుగుతున్న 17వ మ్యాచ్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య మూడుసార్లు టై అయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న హుబ్లీ టైగర్స్ 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది.…
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు ఎవరికి హాని చేయడని చెప్పింది. ఎవరో తన కొడుకును ఇరికించారని.. అతనిని కఠినంగా శిక్షించాలని రాయ్ తల్లి డిమాండ్ చేసింది.
ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ 'చారిత్రాత్మకం' అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు.