Assam: మైనర్పై గ్యాంగ్ రేప్.. యాక్షన్లోకి సీఎం
- అస్సాంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
- బాలిక ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఘటన
- గురువారం సాయంత్రం సమయంలో ఘటన
- స్పందించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
- ఈ ఘటనలో నిందితులను వదిలిపెట్టేది లేదు- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మహిళలపై అత్యాచారాలు పాల్పడటం ఆగడం లేదు. ఎక్కడో చోట కామాంధులు అమ్మాయిలపై క్రూరత్వానికి పాల్పడుతున్నారు. కోల్కతా ఘటన మరువక ముందే అస్సాంలో మరో అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్ చేశారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేయడంపై దేశం మొత్తం ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో అమాయక చిన్నారులపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Parakramam Review: పరాక్రమం సినిమా రివ్యూ
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాలిక చిరిగిన బట్టలతో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం గురువారం సాయంత్రం ఏడు గంటలకు జరిగింది. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స మరియు వైద్య పరీక్షల కోసం నాగాన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. బాలిక వాంగ్మూలాన్ని మహిళా పోలీసు రికార్డు చేసిందని నాగావ్ ఎస్పీ స్వప్నిల్ దేకా తెలిపారు. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. కాగా.. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి.. ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. అత్యాచార ఘటన మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని డీజీపీని ఆదేశించారు. ముఖ్యమంత్రి హిమంత ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘మైనర్‌కు సంబంధించిన భయంకరమైన సంఘటన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని రాశారు’. ఈ ఘటనలో తాము ఎవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని సీఎం బిస్వా శర్మ డీజీపీని ఆదేశించారు.
The horrific incident at Dhing, involving a minor, is a crime against humanity and has struck our collective conscience.
We will NOT SPARE anyone & BRING the perpetrators to JUSTICE. I've directed @DGPAssamPolice to visit the site and ensure swift action against such monsters.
— Himanta Biswa Sarma (@himantabiswa) August 23, 2024
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!