ఫేస్‌బుక్ లైవ్ చేస్తూ మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్నోలో జరిగింది. ఆమె సివిల్ కోర్టు మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునడాన్ని చూసి లాయర్లు కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఆమె కోర్టు భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను బలరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. ఫేస్‌బుక్ లైవ్‌లో న్యాయవాది మాట్లాడుతూ.. ‘నేను బతికుండగా నా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు నా మరణానంతరం.. నా అత్తమామల ఇంట్లో నా అంత్యక్రియలు చేయండి’. అని చెప్పి ఆత్మహత్య చేసుకుంది.
Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్
వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది మాయా రావత్ (32).. ఇటౌంజలో నివాసి సతీష్‌తో వివాహం జరిగింది. దాదాపు పదేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు నడుస్తున్నాయి. అయితే.. వాదించేందుకు మాయ గురువారం కోర్టుకు వచ్చింది. సాయంత్రం ఐదు గంటలకు ఆమె సివిల్ కోర్టులోని రెండు భవనాలను కలిపే వంతెనపైకి చేరుకుంది. అక్కడే నిలబడి ఆమె ఫేస్ బుక్ లైవ్ చేసింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. మహిళ దూకడం చూసి కోర్టు ఆవరణలో ఉన్న లాయర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Asst Professor: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
ఫేస్‌బుక్ లైవ్‌లో మాయ మాట్లాడుతూ.. ‘నేను జీవించి ఉన్నప్పుడు నాకు విధేయులుగా ఎవరూ దొరకలేదని, కానీ నా మరణం తర్వాత నేను ఎవరినైనా కనుగొంటాను. నా కథ విని ఎవరైనా సానుభూతి చూపిస్తే.. నా అత్తమామలకు ఇచ్చిన కట్నం రూ. 1.5 లక్షల నగదు నా సోదరుడు ఇంద్రపాల్‌కి ఇవ్వాలి. నా అంత్యక్రియలు నా పొలంలోనే జరగాలని కోరుకుంటున్నాను. నా చికిత్స కోసం అన్నయ్య చాలా ఖర్చు చేశాడు. ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. నా కోరికను నెరవేర్చండి. మరణానంతరం నా ఆత్మకు శాంతి కలుగుతుంది. అందరికీ నా చివరి నమస్కారాలు.’ అంటూ ఆత్మహత్య చేసుకుంది. కాగా.. మాయా రావత్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతుందని ఇన్‌స్పెక్టర్ వజీర్‌గంజ్ దినేష్ చంద్ర మిశ్రా తెలిపారు. కాగా.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.