తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. చెయ్యార్ పట్టణం సమీపంలో చెన్నైకి వెళ్తున్న వ్యాన్, బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. కాగా.. ఈ ప్రమాదం జరగ్గానే ఇద్దరు ప్రయాణికులు కొద్దిసేపు గాల్లోనే ఉండి కిందపడ్డారు.
బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపి హెల్త్‌కేర్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరచే దిశగా.. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BROEC) అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ముఖ్యమైన విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. అపోలో మెడ్‌స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్.
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలో.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ కోసం భారత్ లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నాడు.
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) పథకం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక 'X'లో తెలిపారు. 'ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS).. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోంది. ఈ చర్య వారి సంక్షేమం.. సురక్షితమైన భవిష్యత్తు పట్ల మా ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.' అని పేర్కొన్నారు.
భారత్లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి హిందువులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు నివసిస్తున్నారు.. వారు పోరాడుతున్నారు. గత నెల రోజులుగా ఒక్క హిందువు కూడా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (OPS) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)కి బదులుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
పశ్చిమ బెంగాల్‌లోని విద్యా శాఖ మూడు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలలో ఈ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపింది. ఈ క్రమంలో.. విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీల పొత్తుకు ఎజెండా లేదని.. కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోమని చెప్పారు.
తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు అయ్యాయి. త్వరలో MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. TG ICET ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల కోసం TGCHE కేంద్రీకృత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది.