SBI EMI: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణాలపై వడ్డీ రేట్లలో కోత విధించింది. ఈ నిర్ణయంతో కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు కూడా రుణాలు మరింత చవకగా మారాయి. సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తున్నాయి. తాజా తగ్గింపుతో SBI ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్ (EBLR) 7.90 శాతానికి తగ్గింది. ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్బిఐ (RBI) ఈ ఏడాది నాలుగోసారి రెపో రేటును తగ్గించడంతో బ్యాంకులు కూడా తమ రుణ రేట్లను తగ్గిస్తున్నాయి.
H1b visa: హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే..!
SBI అన్ని కాలపరిమితుల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల కోత విధించింది. ముఖ్యంగా ఒక సంవత్సరపు MCLR 8.75 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గింది. అలాగే బ్యాంక్ బేస్ రేట్ లేదా బీపీఎల్‌ఆర్‌ను 10 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గించింది. ఈ సవరించిన రేట్లు కూడా డిసెంబర్ 15 నుంచే అమల్లో ఉన్నాయి. తగ్గించిన MCLR రేట్లు ఇలా ఉన్నాయి.
* ఓవర్‌నైట్: 7.85%
* 1 నెల: 7.85%
* 3 నెలలు: 8.25%
* 6 నెలలు: 8.60%
* 1 సంవత్సరం: 8.70%
* 2 సంవత్సరాలు: 8.70%
* 3 సంవత్సరాలు: 8.80%
NTR-Neel : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌పై క్లారిటీ..!
ఇక మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) విషయంలో SBI 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న కొన్ని డిపాజిట్ కాలపరిమితులపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ కేటగిరీ FDలపై వడ్డీ రేటు ఇప్పుడు 6.40 శాతంగా ఉంది. ఇతర కాలపరిమితుల FD రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే 444 రోజుల ప్రత్యేక FD పథకం ‘అమృత వృష్టి’పై వడ్డీ రేటును 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించారు. సవరించిన FD వడ్డీ రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి.
* 7–45 రోజులు: సాధారణులకు 3.05%, సీనియర్ సిటిజన్లు 3.55%
* 46–179 రోజులు: సాధారణులకు 4.90%, సీనియర్ సిటిజన్లకు 5.40%
* 180–210 రోజులు: సాధారణులకు 5.65%, సీనియర్ సిటిజన్లకు 6.15%
* 211 రోజులు–1 సంవత్సరం లోపు: సాధారణులకు 5.90%, సీనియర్ సిటిజన్లకు 6.40%
* 1–2 సంవత్సరాలు: సాధారణులకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%
* 2–3 సంవత్సరాలు: సాధారణులకు 6.40%, సీనియర్ సిటిజన్లకు 6.90%
* 3–5 సంవత్సరాలు: సాధారణులకు 6.30%, సీనియర్ సిటిజన్లకు 6.80%
* 5–10 సంవత్సరాలు: సాధారణులకు 6.05%, సీనియర్ సిటిజన్లకు 7.05%.