Telangana: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్‌పల్లిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి విజయం సాధించారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు సొంత పార్టీ వాళ్లే మోసం చేస్తున్నారనే ఆందోళనతో ఈ నెల 8వ తేదీన సర్పంచి అభ్యర్థి చాల్కి రాజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది.. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో రాజు 9 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.
Read Also: Lenin : ‘లెనిన్’ హిట్ కోసం అఖిల్.. స్పెషల్ ఎఫర్ట్
అలాగే, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మాసానిగూడ గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో 8వ వార్డు సభ్యురాలుగా పల్లె లత తన సమీప ప్రత్యర్థిపై 30 ఓట్ల మెజార్టీతో గెలిచింది. వాస్తవానికి ఈ నెల 7న మాసానిగూడ అనుబంధ గ్రామం మంచర్లగూడెంలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. అయినప్పటికీ లతను ఓటర్లు గెలిపించడం గమనార్హం. ఈ వార్డు స్థానానికి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీఓ పేర్కొన్నారు.