బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కోలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ధురంధర్. ఈ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ రోజు నుండి ఈ సినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో పుష్ప 2 పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమాకు పార్ట్ 2 అధికారికంగా కన్ఫర్మ్ కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌తో ధురంధర్ ఇప్పుడు కేవలం సినిమా కాదు బాలీవుడ్ కి ఇయర్ ఎండ్ లో వచ్చిన సర్ ప్రైజ్ సక్సెస్ అని కూడా చెప్పొచ్చు.
Also Read : Akhanda2Thaandavam : నన్ను చూసుకునే నాకు పొగరు, నా వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ
గత కొన్నాళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న రణవీర్ సింగ్ కు ధురంధర్ బిగ్ రిలీజ్ అనే చెప్పాలి. ఇదిలా ఉండగా తన వైఫ్ దీపికా పడుకునే రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తాను అనే డిమాండ్ పట్ల గత కొంత కాలంగా ఆమెపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రణవీర్ సింగ్ కౌంటర్ ఇచ్చిన వీడియో ఒకటి సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రణవీర్ మాట్లాడుతూ “చాలా సార్లు సహచర నటీనటులు నాపై ఫిర్యాదు చేస్తారు. 8 గంటల షిఫ్ట్‌లో నేను కొన్నిసార్లు 10-12 గంటలు షూటింగ్ చేస్తాను. దాంతో వారు కూడా నాతో పాటు షూటింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వారి ఇతర సినిమాలు షెడ్యూల్స్ కు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 8 గంటల్లో అనుకున్న షూట్ ఫినిష్ కాకుంటే పర్వాలేదు కదా. మీరు కొంచెం ఎక్కువ సేపు షూటింగ్ చేసుకోండి తప్పు లేదు కదా’ అని అన్నారు. అయితే ఈ వీడియో 2022 లో ఓ ఛానెల్ కు ఇచ్చింది. ఆ పాత వీడియోను దీపికా వ్యాఖ్యలకు కౌంటర్ గా బయటకు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.