Kolkata Doctor Case: కోల్‌కతా ఘటన కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు..
- కోల్‌కతా అత్యాచారం కేసులో కొనసాగుతున్న విచారణ
- ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి
- ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు..
- ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పిన నిందితుడు సంజయ్ రాయ్
- ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు
- బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను చూస్తున్న మరికొంత మంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. నేరం చేయడానికి ఒక రోజు ముందు ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో.. ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. 33 మంది వ్యక్తులు బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను అదే పనిగా చూస్తున్నారు.
Ayesha Takia: హేయ్ అయేషా నువ్వేనా? ఏమైంది నీకు.. ఇట్టా తయారయ్యావ్ ఏంటి?
Also Read
సీసీటీవి ఫుటేజీలో నిందితుడు రాయ్ జూనియర్ డాక్టర్ల వైపు చూస్తుండటం కనిపించింది. కాగా.. బాధితురాలు ఆగస్టు 9న తన 36 గంటల షిఫ్ట్‌ను ముగించుకుని తెల్లవారుజామున 1 గంటలకు విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్‌కు వెళ్లింది. 2.30 గంటలకు సెమినార్ హాల్‌లో ఒక జూనియర్ డాక్టర్ ఆమెతో మాట్లాడారు. అనంతరం ఆమె నిద్ర పోదామని పడుకున్న తర్వాత నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉదయం 4 గంటలకు సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లోకి వెళ్తునట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఈ క్రమంలో.. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ, బ్లూటూత్ హెడ్‌సెట్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Cylinder Blast: స్కూల్‌లో పేలిన సిలిండర్.. విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
మరోవైపు.. సీబీఐ నిందితుడికి సైకో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించగా, రాయ్ జంతు స్వభావం ఉన్న వ్యక్తి.. అతను పోర్న్ చూడటం అలవాటు చేసుకున్నాడని కనుగొన్నారు. అంతేకాకుండా.. అతన్ని విచారిస్తున్న సమయంలో.. నిందితుడు ఏమాత్రం భయపడలేదు, పశ్చాత్తాపం చెందలేదని.. మొత్తం సంఘటనను వివరించాడని ఒక అధికారి చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ట్రైనీ డాక్టర్ ను గొంతుకోసి చంపే ముందు ఆమెపై అత్యాచారం చేశారు. శరీరంపై 16 బాహ్య, 9 అంతర్గత గాయాలు గుర్తించారు. కాగా.. ఈ నేరంలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని బాధితురాలి తండ్రి ఆరోపించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!