ఆఫ్రికా దేశం కాంగోలో మొదలైన మంకీపాక్స్ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఆఫ్రికాలోని 12 దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. ఆసియాలో కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో.. థాయిలాండ్ ప్రభుత్వం మంకీపాక్స్ కొత్త వేరియంట్ యొక్క మొదటి కేసు తమ దేశంలో సంభవించినట్లు ధృవీకరించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్టు 14న ఆఫ్రికా నుంచి థాయ్‌లాండ్‌కు వచ్చాడు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో.. అతన్ని పరీక్షించగా అతనికి Mpox, క్లాడ్ 1B అనే స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారించబడింది.
బడ్జెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం రూ. 25 వేలు ఉంటే.. 5G నెట్ వర్క్ కలిగి ఉన్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు చాలా సార్లు కస్టమర్‌లు వాటి పనితీరు.. కెమెరా క్లారిటీ కోసం ఏ ఫోన్‌ను కొంటే బాగుంటుందో తెలుసుకోరు. ఈ క్రమంలో.. ఇప్పుడున్న బెస్ట్ ఫోన్ల జాబితాను మీ ముందుంచాం. వీటిలో మీకు ఇష్టమైన బ్రాండ్ ఏదైనా ఫోన్‌ని కొనుగోలు చేయండి.
అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది.
చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 65 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది.
అమెరికాలోని టెక్సాస్‌లో ఏర్పాటు చేశారు. హ్యూస్టన్ సమీపంలో 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే.. అమెరికాలోని న్యూయార్క్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (151 అడుగులు), ఫ్లోరిడాలోని హాలండేల్ బీచ్‌లోని పెగాసస్ మరియు డ్రాగన్ (110 అడుగులు), తాజాగా.. హనుమంతుడి మూడవ ఎత్తైన విగ్రహం ఉంది. కాగా.. దీనికి 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' అని పేరు పెట్టినట్లు విగ్రహావిష్కరణ నిర్వాహకులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాలలో ఒకటన్నారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్‌కతాలోని ఆర్‌జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్‌కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవుల సంఖ్య అత్యధికంగా 47 శాతం ఉన్నారు. ఆ తర్వాత.. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. వలస వచ్చిన వారిలో వారి జనాభా 29 శాతం ఉంది. వలస వెళ్లే వారిలో హిందువులు మూడవ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింల కంటే కేవలం 5 శాతం మంది హిందువులు మాత్రమే వలస వెళ్లి స్థిరపడ్డారు. అలాగే.. బౌద్ధులు 4 శాతంతో నాల్గవ స్థానంలో ఉండగా.. యూదులు 1 శాతం ఉన్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం…
జమ్మూ కాశ్మీర్ లేహ్‌లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 19 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌పై సీబీఐ మానసిక విశ్లేషణ (Psychoanalysis Test) నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది.