వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు భారత ప్రభుత్వం విదేశీ ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు యూరోపియన్ యూనియన్ నాయకులను పిలిచినట్లుగా సమాచారం. యూరోపియన్ దేశాలతో భారత్ అది పెద్ద వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నాయకులను పిలిచినట్లుగా తెలుస్తోంది. జనవరి 27న వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు .. ఏకమైన మెయిటీ-కుకి బీజేపీ ఎమ్మెల్యేలు
అమెరికా, చైనా తర్వాత యూరోపియన్‌తో మూడో అది పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని భారత్ చేసుకోబోతుంది. దీర్ఘకాలంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకోవడంతో జనవరి 27న సంతకాలు చేసుకోనున్నాయి. దీంతో భారతదేశం-యూరోపియన్ యూనియన్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. తొలుత భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అగ్ర నాయకులు హాజరవుతారు. అనంతరం మరోసటి రోజు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసుకోనున్నాయి.
ఇది కూడా చదవండి: H1b visa: హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే..!
జనవరి 27న భారతదేశం -యూరోపియన్ యూనియన్ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసుకోన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక సజీవ పత్రంగా ఉంటుందని ఇప్పటికే ఈయూ వర్గాలు తెలిపాయి. యూరోపియన్ యూనియన్‌తో భారత్ వాణిజ్యం సుమారు 136 బిలియన్ల వరకు ఉండనుంది. ఇది యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలువనుంది.
అతిథులు..
జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పాల్గొంటారు. గణతంత్ర దినోత్సవం నాడు ఇద్దరు యూరోపియన్ నాయకులు, ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి వేదికను పంచుకోనున్నారు. భారత ఆహ్వానాన్ని ఇప్పటికే ఈయూ నాయకత్వం అంగీకరించింది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది.