ఆగస్టు నెలకు సంబధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 2024లో మొత్తం GST వసూళ్లు రూ. 1.75 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపింది. వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగాయి. గత ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (GST) ఆదాయం రూ. 1.59 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టులో రూ. 1.75 లక్షల కోట్లు వసూలు చేసింది.
గతేడాది ఓ మహిళ తనను తాను పెళ్లి చేసుకున్న ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా.. ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్. ఆమె పేరు సులనే కారీ. ఈ 36 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. ఈమె 'సోలోగామి' తనను తాను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. బ్రెజిల్‌కు చెందిన సులనే కారీ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుంది.
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోఢీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడి వారి కృషిని అభినందించారు. అథ్లెట్లు మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్ మరియు రుబీనా ఫ్రాన్సిస్‌లతో ప్రధాని మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌కు భారత అండర్ 19 జట్టులో అవకాశం లభించింది. సెప్టెంబర్, అక్టోబర్‌లలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ఆడనున్నాడు. కాగా.. కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ కర్ణాటక తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. అతనికి రివార్డ్ లభించింది. అయితే.. భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన సమిత్ ద్రవిడ్, అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడలేడు.
పూణెలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదంతో తమ్ముడు, అతని భార్య తన సోదరిని హత్య చేశారు. ఇద్దరూ కలిసి మహిళ తల నరికి మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ క్రమంలో.. పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అష్ఫాక్ ఖాన్, అతని భార్య హమిదాగా గుర్తించారు.
భారత వైమానిక దళ వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ (వాయు భవన్)లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం.. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు.
పారాలింపిక్స్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పారాలింపిక్స్ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (SH1) ఈవెంట్‌లో భారత షూటర్ అవనీ లేఖరా, సిద్ధార్థ్ బాబు ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అవనీ 11వ స్థానంలో నిలవగా, సిద్ధార్థ్ బాబు 28వ స్థానంలో నిలిచాడు.
యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు.
దేశంలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ(IMD) కొత్త నివేదికను విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. అక్కడ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
జబల్‌పూర్ నుంచి హర్యానా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఫ్లైట్ను నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు వచ్చిన విమానం.. ఇండిగో 6ఈ 7308గా గుర్తించారు. విమానాన్ని నాగ్‌పూర్‌లో ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపారు. ఆ తరువాత.. వారికి అవసరమైన భద్రతా తనిఖీలు చేపట్టారు.