భారత మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ 2024 క్లాసిక్ 350 వచ్చేసింది. మార్కెట్లో రూ. 1.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేసింది. దీని టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ. 2.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. రీ మోడల్ చేసిన ఈ బైక్ లో ఇప్పటికే ఉన్న మెకానికల్ భాగాలను కొనసాగిస్తూ కొత్త రంగు ఎంపికలు, ఎక్స్ట్రా పార్ట్స్ను యాడ్ చేశారు. కొత్త 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బుకింగ్.. టెస్ట్ రైడ్‌లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మళ్లీ యువరాజ్ సింగ్ను గుర్తు చేశాడు ఈ బ్యాట్స్ మెన్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్ 2024)లో 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు. దీంతో.. మరోసారి యువరాజ్ సింగ్ ను గుర్తు చేసుకునేలా చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ప్రియాంష్ ఆర్య.. నార్త్ ఢిల్లీ బౌలర్ మానన్ భరద్వాజ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6…
పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్ పారాలింపిక్ క్రీడల్లో భారత్‌కు ఐదో పతకాన్ని అందించింది.
యూపీలోని బల్‌రామ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది.
కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. టేకాఫ్ తర్వాత, ఇండిగో విమానం 6E0573 యొక్క ఎడమ ఇంజిన్ లోపం కారణంగా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
గుజరాత్‌లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. వర్షాలు, వరదల నుంచి గుజరాత్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. అస్నా తుఫాను ముంచుకొస్తుంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. అందులో.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి, ఆహారం రెండూ సరిగ్గా ఉండటం అవసరం. వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మధుమేహం, రక్తపోటు, కాలేయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ బరువు పెరుగుట సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా బరువును నియంత్రించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాల బారిన చాలా మంది పడుతున్నారు. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారితీస్తాయి. యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించి చికిత్స తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని కొట్టి చంపినందుకు గాను గోసంరక్షక బృందానికి చెందిన ఐదుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఫ్ మాంసం తిన్నాడనే అనుమానంతో నిందితులు సబీర్ మాలిక్‌ను ఆగస్టు 27న హత్య చేశారు.
రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడిపై కొందరు యువకులు చితకబాదారు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్ధుడు రైలులో ప్రయాణిస్తుండగా.., అతను బీఫ్ మటన్ తీసుకెళుతున్నాడనే అనుమానంతో కొందరు యువకులు దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.