ఆగస్టు నెలకు సంబధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 2024లో మొత్తం GST వసూళ్లు రూ. 1.75 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపింది. వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగాయి. గత ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (GST) ఆదాయం రూ. 1.59 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టులో రూ. 1.75 లక్షల కోట్లు వసూలు చేసింది. కాగా.. జూలైలో రూ. 1.82 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖాజానాలోకి వచ్చింది.
Read Also: NTR District: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు బస.. లక్ష మందికి సరిపోయేలా ఆహారం..!
ఆగస్టు 2024లో దేశీయ ఆదాయం 9.2 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరుకుంది. వస్తువుల దిగుమతి ద్వారా నికర GSAT ఆదాయం 12.1 శాతం పెరిగి రూ.49,976 కోట్లకు చేరుకుంది. సమీక్షిస్తున్న నెలలో రూ.24,460 కోట్ల విలువైన రీఫండ్‌లు జారీ చేశారు. ఇది వార్షిక ప్రాతిపదికన 38 శాతం ఎక్కువ. రీఫండ్‌లను జారీ చేసిన తర్వాత.. నికర GST ఆదాయం నెలలో 6.5 శాతం పెరిగి రూ. 1.5 లక్షల కోట్లకు చేరుకుంది.
Read Also: Sologami: ఏడాది క్రితం తనను తాను పెళ్లి చేసుకున్న ఓ మహిళ.. ఇప్పుడు విడాకులు
2024లో జీఎస్‌టీ వసూళ్లు ఎక్కువ
ఈ ఏడాది ఇప్పటివరకు జీఎస్టీ వసూళ్లు రూ.9.13 లక్షల కోట్లు. 2023లో ఇప్పటివరకు జీఎస్టీ వసూళ్లు రూ.8.29 లక్షల కోట్లు. 2023తో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 10.1 శాతం పెరిగాయి. కాగా.. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 9న ఉండే అవకాశం ఉంది.