వయసు పెరిగే కొద్దీ కీళ్లు, ఎముకల నొప్పుల సమస్యలు అధికమవుతాయి. 50 ఏళ్లలోపు వ్యక్తులలో కూడా ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా.. నడవడం, సాధారణ పనులు చేయడం కష్టమవుతుంది. కీళ్ల నొప్పులు.. పురుషులు, మహిళలు ఇద్దరికీ వస్తాయి. మహిళలకు గర్భధారణ, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలకు కీళ్ల నొప్పుల సమస్య వచ్చే అవకాశ ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేష్ కథునియా రజత పతకం గెలుచుకున్నాడు. 42.22 మీటర్లతో యోగేష్ కథునియా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. భారత్ మరో పతకం సాధించింది. కాగా.. పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా ఎనిమిది పతకాలు సాధించింది.
జమ్మూలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బీహార్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు బీజేపీ నగర అధ్యక్షుడు ఫంతుష్ కుమార్ అలియాస్ బంటీ సింగ్ గా గుర్తించారు. బీజేపీ నాయకుడు తన కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగులు కాల్చారని స్థానికులు చెబుతున్నారు.
పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఆదివారం భారత ఆటగాళ్లు రెండు పతకాలు సాధించారు. భారత్‌కు హైజంప్‌లో ఒక పతకం, స్ప్రింట్‌లో ఒక పతకం లభించింది. దీంతో.. భారత్‌కు పతకాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో.. సచిన్ టెండూల్కర్ స్పందిచారు. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన.. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రశంసించారు.
టీమిండియా మాజీ కెప్టె్న్ ఎంఎస్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ఆరోపణలు గుప్పించారు. తన కొడుకు కెరీర్‌ను ధోనీనే నాశనం చేశాడంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో కూడా పలుమార్లు ధోనీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా మరోసారి కామెంట్స్ చేశారు. ధోని తన కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడని తెలిపాడు. క్యాన్సర్‌తో పోరాడి భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడని.. యువరాజ్‌కు భారతరత్న ఇవ్వాలని యోగరాజ్ కోరాడు. కాగా.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే…
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. కృష్ణా నది వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలు నిరసనల్లో పాల్గొన్నారు. సినీ దర్శకురాలు అపర్ణా సేన్‌తో సహా బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం వేలాది మంది ప్రజలతో కలిసి నిరసనల్లో పాలు పంచుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి చేపడుతుంది.
యూపీ రాజధాని లక్నోలోని లోహియా లా యూనివర్సిటీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. మృతురాలి తండ్రి ఒక ఐపీఎస్ అధికారి. అతను ఎన్ఐఏ (NIA)లో విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎస్ కుమార్తె మరణ వార్తతో పోలీసు శాఖలో కలకలం రేగింది.