Rain Alert: సెప్టెంబర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ..
- దేశంలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ(IMD) కొత్త నివేదిక విడుదల
- దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి- ఐఎండీ
- ఉత్తరాఖండ్.. రాజస్థాన్.. హిమాచల్ ప్రదేశ్.. పంజాబ్‌లోని..
- కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ(IMD) కొత్త నివేదికను విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. అక్కడ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టులో భారతదేశంలో సగటు కంటే 16 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2001 నుండి ఇంత వర్షపాతం నమోదు కావడం ఇది ఐదవసారి. అయితే.. ఆగస్టు నెలలో 287 మిల్లీమీటర్ల మంచి వర్షపాతం కూడా వేడిని చల్లార్చలేకపోయింది. ఆగస్టు నెలలో కనిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంది.
Read Also: Hyderabad-Vijayawada highway Closed: హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్..
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ఇదిలా ఉంటే.. ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ అయింది. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. ఈ క్రమంలో.. కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణా, రాయలసీమ, కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, దక్షిణ విదర్భ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read Also: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!