ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న అనేక వ్యాధుల మధ్య.. మీరు ఆరోగ్యంగా ఉండటం ఒక వరం. అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? దీనికి ఏదైనా పరీక్ష ఉందా?.. వ్యాధుల విషయంలో కొన్ని రకాల పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించవచ్చు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులలో రక్త పరీక్ష.. కడుపు సమస్యలలో అల్ట్రాసౌండ్ తో గుర్తిస్తారు. అయితే మనం ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం ఎలా..?
సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్న అగ్నివీర్‌కు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ కానుక ఇవ్వనుంది. 4 సంవత్సరాల వ్యవధి తర్వాత.. సైన్యంలో అగ్నివీరులను కొనసాగించే పరిమితిని పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం.. అగ్నివీర్‌లో 25 శాతం మంది పని చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెల్లడి కాలేదు.
అనంతపురానికి టీమిండియా క్రికెటర్లు వచ్చారు. దులీఫ్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ ఆటగాళ్లు ఇక్కడకు చేరుకున్నారు. కాగా.. ఈనెల 5 నుంచి అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగనున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ యువకుడు తన మేనకోడలిని గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫరాజ్ నిరుద్యోగం కారణంగా మానసికంగా కుంగిపోయాడు. అంతేకాకుండా.. తనకు ఉద్యోగం లేదని కుటుంబ సభ్యులు ఎప్పుడూ తిడుతుండే వారు.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి రెండు పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్ రజత పతకాన్ని గెలుచుకుంది. అదే విభాగంలో మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 11 పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే.. బ్యాడ్మింటన్‌లో దేశానికి ఇది మూడో పతకం. మురుగేశన్, మనీషా కంటే ముందు నితీష్ కుమార్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.
ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా హర్సూద్ మున్సిపల్ కౌన్సిల్ సీఎంఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. పిస్టల్‌తో వచ్చిన రోజువారీ వేతనంపై పనిచేస్తున్న డ్రైవర్, మహిళా సీఎంఓ (ముఖ్య మున్సిపల్ అధికారి)పై వరుసగా 3 రౌండ్లు కాల్పులు జరిపాడు.
అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బ్రహ్మపుత్ర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్కు ముందు వాట్సాప్‌లో 'సారీ పిల్లలు' అని రాసింది. ఈ క్రమంలో.. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ, ఆమె పిల్లల కొన్ని వస్తువులను పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
టాటా మోటార్స్ కర్వ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోడల్‌ను లాంచ్ చేసింది. గత నెలలో కర్వ్ ఈవీ(Curvv EV) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. టాటా కర్వ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కాగా.. కర్వ్ టాప్ మోడల్ రూ. 17.69 లక్షలు ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). 2024 అక్టోబర్ 31 వరకు బుకింగ్‌లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
మీ జుట్టుకు ఎంత నూనె రాసుకుంటే జుట్టు అంత దృఢంగా మారుతుందని బామ్మలు చెప్పడాన్ని మీరు తరచుగా వినే ఉంటారు. ఈ మాట నిజం కూడా. కానీ.. ఈ రోజుల్లో జుట్టుకు నూనె రాసుకోవడమే మానేస్తున్నారు. ఎందుకంటే.. జుట్టుకు ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల చాలా హాని జరుగుతుందని తెలుసుకుంటున్నారు. కారణాలేంటంటే.. మొదటిది ఈ రోజుల్లో మీకు కెమికల్ లేని హెయిర్ ఆయిల్ లభించదు. రెండవది నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం మధ్య.. మీరు ప్రతిరోజూ మీ జుట్టుకు చాలా నూనెను…