ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా.. దీనిపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
షేక్ హసీనా వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్‌లోనే కొనసాగితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రష్యాలో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. విమాన టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ Mi-8T అదృశ్యమైంది. అయితే.. హెలికాప్టర్ కూలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ మిస్సింగ్ అయిన సమయంలో అందులో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు.
ఇండియాకు చెందిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అరంగేట్రంలోనే అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి రెండవ స్థానంలో నిలిచింది. పారిస్ పారాలింపిక్స్‌లో 16వ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది.
గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది చపాతీని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. బరువు పెరగడం లేదా తగ్గడం విషయానికి వస్తే.. గోధుమ రొట్టె వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో తలెత్తుతుంది. ఇది బరువును పెంచుతుందా లేదా బరువు తగ్గడంలో సహాయపడుతుందా..?
భారతీయ ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీనిని అనేక రకాలుగా తింటారు. కానీ అన్నం వినియోగానికి సంబంధించి, అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా.. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి లేదా బరువును నియంత్రించుకోవడానికి ప్రజలు తరచుగా అన్నం తినడం మానేస్తారు.
పొలాల్లోకి తీసుకెళ్లి ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగింది. రాత్ గ్రామంలో ముగ్గురు యువకులు బాలికను బైక్‌పై బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆ యువతిని వదిలేసి పారిపోయారు.
ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అందులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం కోల్పోయాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. యశస్వి ఒక్క స్థానం సాధించి ఏడో స్థానానికి చేరుకున్నాడు.
కోయంబత్తూర్‌లోని బోచే ఫుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఈ ఛాలెంజ్లో బుధవారం వందలాది మంది పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ ఎలా ఉందంటే.. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తినాలి. అలా తిన్న వారికి లక్ష రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చని ఆ రెస్టారెంట్ ప్రకటించింది.
మిజోరంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు దాటికి కొండచరియలు విరిగిపడి కవాన్‌పుయ్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ కుప్ప కూలింది.