పారాలింపిక్స్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పారాలింపిక్స్ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (SH1) ఈవెంట్‌లో భారత షూటర్ అవనీ లేఖరా, సిద్ధార్థ్ బాబు ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అవనీ 11వ స్థానంలో నిలవగా, సిద్ధార్థ్ బాబు 28వ స్థానంలో నిలిచాడు. అవని 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో పతకం సాధించేందుకు విఫలమైంది. అవనీ మొత్తం 628.8 పాయింట్లు చేయగా.. సిద్ధార్థ్ 628.3 పాయింట్ల స్కోర్ చేశాడు. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్1) ఈవెంట్‌లో అవని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వరుసగా రెండు పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ప్రపంచ రికార్డుతో టైటిల్‌ను సాధించింది. SH1లో ఆటగాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైఫిల్ పట్టుకుని నిలబడి లేదా కూర్చుని షూట్ చేయవచ్చు.
Read Also: Crime: 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం..
టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత.. పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అవనీ స్వర్ణం సాధించింది. ఆమె 249.7 స్కోరుతో ఫైనల్‌లో గెలిచింది. స్వదేశానికి చెందిన మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని గెలిచిన ఆత్మవిశ్వాసంతో అవని లేఖరా శుక్రవారం బరిలోకి దిగి స్వర్ణ పతకం సాధించింది. కానీ.. ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఓడి ఫైనల్కు చేరుకోలేకపోయింది.
Read Also: Chandrababu On Rains: భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది.. సహయక చర్యలు కొనసాగుతున్నాయి..