ఫార్ములా ఈ రేస్ ఇష్యూపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా తనపై కేస్ అని లీక్‌లు ఇస్తున్నారు.. నాలుగు గోడల మధ్య ఎందుకు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి అని అడిగానన్నారు. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశానని కేటీఆర్ తెలిపారు. అయినా చర్చకు వచ్చే దమ్ము లేదు ప్రభుత్వానికి అని పేర్కొన్నారు.
కేటీఆర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి. నిన్న సాయంత్రం ఏసీబీకి 5:30కు ఫిర్యాదు అందింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ MAUD ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం విచారణ చేయగా అవకతవకలు బయటపడ్డాయి.
ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.
తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఈరోజు రిలీజైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్4 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. అతనిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. ఇక మైదానంలో ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో చెప్పనవసరం లేదు. ప్రత్యర్థులు అతన్ని కవ్వించారంటే.. వారికి మూడినట్లే. తనదైన స్టైల్‌లో వారికి ఇచ్చిపడేస్తాడు. ఇక.. బయట మాత్రం ఎంతో ప్రశాంతంగా తన కుటుంబంతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే.. తాజాగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు.
తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది.. చేసిన అప్పులు సరిగా చెప్పలేదు.. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తప్పు పట్టిందని అన్నారు.
ఈ రోజు ఇండియా ఉమెన్స్-వెస్టిండీస్ ఉమెన్స్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. నవీ ముంబై మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు అలవోక విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో చేధించింది.
శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే.. రోగనిరోధక శక్తి వేగంగా బలహీనమైపోతుంది. ఈ క్రమంలో.. ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా.. జీవనశైలిలో మార్పులు, చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తి కారణంగా వల్ల జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే.. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ బొప్పాయిని తినండి. శరీరాన్ని హైడ్రేట్ చేసే సూపర్ ఫుడ్.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కొత్త చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్‌కు గోవా కోర్టు నోటీసులు పంపింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తన పేరును పేర్కొన్నందుకు సంజయ్ సింగ్ నుండి సీఎం ప్రమోద్ సావంత్ భార్య 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరింది.