ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను A-1గా పేర్కొంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదు చేసింది. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు. RBI గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఎఫ్‌ఈవో కంపెనీకి రూ.45 కోట్లు HMDA చెల్లించిందని కేసులు పెట్టారు. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్టు కేటీఆర్‌పై అభియోగాలు మోపపడ్డాయి. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ అభియోగాలు మోపింది. ఐఏఎస్ అరవింద్‌కుమార్.. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడంపై అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి రూ.8కోట్ల ఫైన్ వేసింది ఆర్బీఐ.. అధికారంలోకి వచ్చాక RBIకి రూ.8 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. అయితే, కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: CM Revanth: గూగుల్లో చెప్పేదే నిజం అనుకుంటారు.. పుస్తకాల్లో దొరికేదే నిజమైన సమాచారం
కేటీఆర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు బయటపడ్డాయి. నిన్న సాయంత్రం ఏసీబీకి 5:30కు ఫిర్యాదు అందింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ MAUD ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం విచారణ చేయగా అవకతవకలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిధులు రూ. 54 కోట్ల 88లక్షల 87 వేల 043 అక్రమ బదిలీలు అయినట్లు గుర్తించింది. యూకేకి చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీకి.. రెండు విడతల్లో చెల్లింపు చేసినట్లు గుర్తించారు. మొదట 3/10/2023న 22కోట్ల 69లక్షల 63వేల 125, రెండవ విడత 11/10/2023 న 23కోట్ల 01 లక్షల 97వేల 500 బదిలీ అయినట్లు గుర్తించారు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి బదిలీ అయ్యాయి. విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్ఎండీఏకు అదనపు పన్ను భారం పడింది. రూ. 8 కోట్ల 6 లక్షల 75వేల 404అదనపు పన్ను భారం పడింది. రూ. 10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్ధిక శాక అనుమతి అవసరం ఉంటుంది. సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేక పోవడంతో HMDA నిధులను మల్లించారు.
Read Also: UP: ఫస్ట్ నైట్‌లో బీరు, గంజాయి కోరిన కొత్త పెళ్లికూతురు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..