తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు వేటకుక్కలుగా మారి అందినకాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని.. ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని తెలిపారు.
ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ పై చర్చ జరిగింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చారు. ఈ క్రమంలో భూ భారతి బిల్లుకు శాసన సభ ఆమోదం కూడా తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కొద్ది మందికి జరుగుతున్న నష్టం పేరు మీద ధరణి రద్దు చేసి భూ భారతి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. పదిరోజులు(ఈనెల 30) వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్ ఈ-ఫార్ములా కేసుపై సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీఏసీ మీటింగ్‌లో 9 అంశాలు ఇచ్చారు.. దీంట్లో ఈ ఫార్ములా గురించి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఫార్ములా ప్రతినిధి తనను కలిశారని.. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ ఫార్ములా ప్రతినిధిని తన ఇంట్లో కలిశానని అన్నారు.
హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని అన్నారు.
భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్‌పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు.
ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో హస్తినాపురం ఈస్ట్ క్రెస్ట్‌లో అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో ప్రణవ గ్రూప్ ఛైర్మన్ బూరుగు రవి కుమార్, ఎక్సూటివ్ డైరెక్టర్ బూరుగు రాంబాబు.. బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురు స్వామి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ గురు స్వామి, బండారి అశోక్ గుప్తా విరమలయ గుప్తా, బల మలయ గుప్తా, శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.
తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీలో 14 రంగాలు పెట్టుబడి తీసుకొచ్చేవిగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ వాళ్లకు రేస్ కోసం అడిగాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చాలనుకున్నామని తెలిపారు. వాళ్లు రాలేమని అన్నారు, ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు, తప్పిదాల ఫలితంగా రాష్ట్రం ఏ విధంగా దివాళా తీసిందో శాసనసభ సాక్షిగా ఈరోజు బయటపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.6 లక్షల 71 వేల 756 కోట్లు అప్పు చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.. అదే సమయంలో ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1 లక్షా 27 వేల కోట్లకుపైగా అప్పులు చేసినట్లు కూడా అసెంబ్లీ సాక్షిగా వెల్లడైందన్నారు.