బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
శీతాకాలంలో తాజా, ఆరోగ్యకరమైన పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో జామపండు ఒకటి. దీనిని సామాన్యంగా చాలా మంది తింటుంటారు. అయితే.. చలికాలంలో జామ పండును జ్యూస్ చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బ్రిస్బేన్‌లో పరుగుల వరద పారిస్తాడనుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచాడు. జోస్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో.. కోహ్లీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వారమే కొత్త వాహనాన్ని లాంచ్ చేయనున్నారు.
ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.
బైక్ పై గానీ, కార్లలో గానీ వెళ్తున్నప్పుడు కుక్కలు వాహనాల వెనుక పరుగెత్తుకుంటూ వస్తాయి. కదులుతున్న వాహనాన్ని వెంబడిస్తూ ఒక్కోసారి కొన్ని కిలోమీటర్ల మేర పరుగెత్తుకుంటూ వస్తాయి. ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో కూడా ఎదురై ఉంటుంది.. ఒక్కోసారి మన వాహనం వెనుక పరిగెత్తుకుంటూ వస్తుందన్న భయంతో వాహనంపై బ్యాలెన్స్ తప్పి పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి.
నేపాల్ ప్రీమియర్ లీగ్ (NPL)లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈరోజు కర్నాలీ యాక్స్, ఫార్ వెస్ట్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. కర్నాలీ జట్టు బ్యాటర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సన్నివేశం కనపడింది.
ఫ్రాన్స్‌లో 'చిడో' తుఫాను విధ్వంసం సృష్టించింది. మయోట్ ప్రాంతంలో తుఫాను కారణంగా వందలాది మంది మరణించారు. అణుదాడి తర్వాత జరిగిన విధ్వంసంలా చాలా ప్రాంతాల్లో విధ్వంస దృశ్యాలు నెలకొన్నాయి. తుఫాను దాటికి చాలా రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడింది. అలాగే.. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య వేలకు చేరుకోవచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ముంబైలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వర్లీ ప్రాంతంలోని అన్నీ బిసెంట్ రోడ్డులోని అట్రియా మాల్ ఎదురుగా ఉన్న పూనమ్ ఛాంబర్స్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే 10 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంతరం.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.