రవాణాశాఖలో డీటీసీలను జేటీసీలుగా, ఆర్టీవోలను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా డీటీసిలు, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే బీఆర్ఎస్ కాళ్లలో కట్టెలు పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తా అంటే వద్దు అంటారు.. ఫ్యూచర్ సిటీ వద్దు అంటారు.. రుణమాఫీ వద్దు అంటారు.. ఇండస్ట్రీ పెడతా అంటే వద్దు అంటారు.. ఏం చేయాలి మరి అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను నల్లమల నుండి వచ్చానని... ఇక్కడ తొక్కితే అక్కడికి పోయారు వాళ్ళు అని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం.. బీఆర్ఎస్సే కారణమని మండిపడ్డారు. తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు.. వాళ్ళు తెచ్చిన అప్పు 11.5 వడ్డీ అని అన్నారు. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటాం.. వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళని ఆరోపించారు.
సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని.. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నుంచి మిస్సింగ్ అయిన యువతి కేసు మిస్టరీగా మారింది. ఆమె కనిపించకుండా పోయి 50 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. హాస్టల్ నుంచి తన మామయ్య ఇంటికి అని బయలుదేరిన విద్యార్థిని మధ్యలోనే అదృశ్యం అయింది. మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినా నేటికీ జాడ దొరకకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.
ఐకియా అంటే ఫర్నీచర్ అమ్మకాలకు బ్రాండ్ అంబాసిడర్. హైదరాబాద్ ఐకియా కంపెనీలో కొనుగోలు చేసిన ఫర్నీచర్ ఐటమ్‌ను వ్యాన్లలో సరఫరా చేసి.. తిరుగు ప్రయాణంలో గచ్చిబౌలి ప్రాంతంలో పనిచేసే ఐటీ ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకొని వారికి గంజాయి సరఫరా చేస్తూ అదనపు ఆదాయం సంపాందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. వారిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలికాం నగర్, గచ్చిబౌలి ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ పార్కు ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఐకియా సరుకులు రవాణ…
ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు.