మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, వరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అసంతృప్తిగా.. రాజకీయాల్లో హాట్ హాట్‌గా ఉన్న తరుణంలో ఈ భేటీ జరిగింది.
ఓ చిన్నారి ఆడుకుంటూ విక్స్ మూత మింగి మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని సారెడి బాడి పట్టణంలో చోటు చేసుకుంది. 14 నెలల చిన్నారి ఆడుకుంటున్నాడని గమనించని తల్లిదండ్రులు.. అతని వద్ద ఉన్న విక్స్ బాక్స్ మూత మింగి మృత్యువాత చెందాడు. విక్స్ మూత మింగగానే వెంటనే.. చిన్నారి కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి చెందారు. మాధవన్‌ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చగా.. గుండెపోటుతో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాధవన్ చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు. అంతకుముందు రాజీవ్ గాంధీతో కూడా కలిసి పనిచేశారు.
కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. తాజాగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలంలో ఈ విద్యార్థిని అమ్ముడుపోయింది. రూ. 55 లక్షల పారితోషకంతో ఢిల్లీ క్యాపిటల్స్ శ్రీ చరణి అనే విద్యార్ధిని సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన విద్యార్థిని.
హ్యుందాయ్ క్రెటా EV భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 సంవత్సరంలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటి రోజున ప్రారంభించబడుతుంది. జనవరి 17న హ్యుందాయ్ క్రెటా EV ఇండియాలో లాంచ్ అవుతుంది.
2024లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) సేల్స్ భారీగా జరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఓలా సెగ్మెంట్‌లో నంబర్-1గా కొనసాగుతోంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో కంపెనీ రిటైల్ విక్రయాల సంఖ్య 4 లక్షల యూనిట్లను దాటింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' అమలును ఇటీవలే ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. ఒక సర్వేను ఉటంకిస్తూ, ఢిల్లీలోని 60 శాతం మంది మహిళలు తనకు ఓటు వేయబోతున్నారని, 40 శాతం మంది తనకు అనుకూలంగా లేరని అన్నారు.
బాదంపప్పు తినడం అందరికీ అలవాటు ఉంటుంది. బాదం పప్పులో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కాల్చిన బాదం పప్పు వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
వివో (Vivo) 'Y' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు కంపెనీ 'Vivo Y300' అని పేరు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనా కంటే ముందే భారత్‌లో ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే.. డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది.