తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్ ఎస్ యు ఐ నాయకుడి వివాహానికి హాజరైన ఇద్దరు నేతలు, ఆ పెళ్లి వేడుకను తమ రాజకీయ, వర్గ విభేదాలకు వేదికగా మార్చుకోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితమే వరంగల్ లో రాహుల్ సభ విజయవంతం కావడం, కలసి పని చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు పన్నెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ […]
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, 2009 ముందు వరకూ సివిల్ కాంట్రాక్టరుగా ఉన్న అన్నా రాంబాబు, ప్రజారాజ్యం పార్టీలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావటంతో, కాంగ్రెస్ లో కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో, బహిరంగంగా ఆ పార్టీ కండువాను తీసి […]
జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది. మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్ […]
ప్రపంచ కుబేరుడి స్కెచ్చేంటి?ట్విట్టర్ డీల్ వెనుక లక్ష్యమేంటి?లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజమెంత ? ఎలాన్ మస్క్.. మామూలోడు కాదు..ప్రపంచ కుబేరుడిగా ఎదిగేంత వరకు నిద్రపోలేదు..కొత్త కొత్త ప్రాజెక్టులతో సంచలనంగా మారతాడు.పెట్టుబడులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు..చివరికి చెప్పేదొకటి చేసేదొకటి అనిపించుకుంటాడు..అసలు సిసలైన మాయగాడిగా నిలబడతాడు.కానీ, అసలు టార్గెట్ అమెరికా రాజీకీయాల్లో చక్రం తిప్పటమేనా?ఇదే ఇప్పుడు నడుస్తున్న చర్చ చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేకపోవడం రాజకీయ నాయకుల లక్షణం.ప్రపంచ కుబేరుడిగా, సక్సెస్ ఫుల్ గా బిజినెస్ మ్యాన్ గా […]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన భిన్నంగా జరిగింది. కేడర్ నుంచి వచ్చిన స్పందన చూశాక.. ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారో ఏమో.. డోన్ టీడీపీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించేశారు. ఈ స్టేట్మెంట్పై టీడీపీతోపాటు జనసేన కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయాయట. ఒక్క డోన్‌లోనే కాదు.. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు.. కొన్ని రోజులుగా పొత్తులపై పదే పదే మాట్లాడుతున్నారు. అందరూ […]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ. ఈ అంశంపై విపక్షాల వాయిస్ పెరగడంతో రచ్చ రచ్చ అవుతోంది. దీంతో అనంతబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు.. మంత్రులుతో ఆయన టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు […]
దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని గతంలో ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కేసీఆర్ జాతీయస్థాయి పర్యటనలో కీలక భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఫ్రంట్లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలని అన్నప్పుడే వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతోపాటు ప్రగతి భవన్‌కు వచ్చిన పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చలను […]
సిర్పూర్కర్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత ఉందా?ఎన్ కౌంటర్ బూటకం కాకపోతే కేసు హైకోర్టుకు ఎందుకు వచ్చింది? కమిషన్ నివేదిక ఆధారంగా సుప్రీం తీర్పెందుకు ప్రకటించలేదు?ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష ఉంటుందా? దిశ కేసు… దేశమంతా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దిశపై జరిగిన దాడి ప్రజల్ని ఎంత కదిలించిందో, ఆ తర్వాత పదిరోజుల్లోపే దిశ నిందితుల ఎన్ కౌంటర్ అంతే సంచలనంగా మారింది. 2019 డిసెంబర్ 6న దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ […]
ఖమ్మం పార్లమెంటుకు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచరులను పెట్టుకున్నారు. అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తారు ఈ మాజీ ఎంపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగులేటి పాత్రపై రకరకాలుగా ప్రచారం జరిగింది. క్రాస్ ఓటింగ్ వెనక పొంగులేటి ఉన్నట్టు సీఎం కేసీఆర్‌కు నివేదికలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు పార్టీ పదవులు.. […]
గడిచిన రెండు ఎన్నికలలోనూ వైసీపీకి ఉమ్మడి విజయనగరం జిల్లా ఏజెన్సీలో తిరిగులేని మెజారిటీని అందించారు జనం. ఇప్పుడు సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ సెగ్మెంట్లను కలుపుతూ కొత్తగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. ఆ హోదాలో జిల్లా కేంద్రంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు కూడా. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముంచేశారు. అంతా కలిసి సాగుతారు అని అనుకుంటున్న తరుణంలో నాయకుల మధ్య […]