Kohli-Rohit: రోహిత్, విరాట్‌ల కంటే గొప్పవారు ఎవరున్నారు?.. గంభీర్పై హర్భజన్ ఫైర్
- దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ అద్భుత ఫామ్..
- రోహిత్, కోహ్లీపై ప్రశంసలు కురిపించిన టీమిడియా మాజీ స్పిన్నర్ హర్భజన్..
- రోహిత్- విరాట్‌లాంటి అనుభవజ్ఞులను తప్పించడం ప్రమాదం గంభీర్: హర్భజన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kohli-Rohit: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చూపిన అద్భుత ఫామ్‌పై మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ చానల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తప్పనిసరిగా ఉండాలని, జట్టులో మొదటి ఇద్దరి పేర్లు వీరేవి అవ్వాలని సూచించారు. రోహిత్ శర్మ సిరీస్‌లో రెండు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా, విరాట్ కోహ్లీ వరుస రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో చెలరేగాడని తెలిపాడు. అయితే, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం మంచిదే కానీ, వారి కోసం రోహిత్- విరాట్‌లాంటి అనుభవజ్ఞులను పక్కకు తప్పించడం పెద్ద పెద్ద టోర్నీల్లో ప్రమాదకరమని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.
Also Read
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
అయితే, రోహిత్, విరాట్‌లకంటే గొప్పవారు ఎవరున్నారు?.. వీరి చుట్టూ జట్టును నిర్మించాలి.. జట్టులో అనుభవాన్ని కోల్పోతే కీలక మ్యాచ్‌ల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు. ఇది వీరి చివరి వరల్డ్‌కప్ కావొచ్చు.. కనుక తప్పకుండా ఈ ఇద్దరు ఆడాలని చెప్పుకొచ్చాడు. గత వరల్డ్‌కప్ ఫైనల్‌లో స్లో పిచ్ కారణంగా భారత్ అవకాశాలు కోల్పోయిందని గుర్తు చేసిన హర్భజన్.. రోహిత్ నాయకత్వంలో భారత జట్టు ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. ఇక, 2024- 25 వన్డేల్లో విరాట్ 651 పరుగులతో, రోహిత్ 650 పరుగులతో భారత్ తరఫున అగ్రస్థానాల్లో నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఈ జంట అత్యధిక పరుగులు చేశారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!