ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ఇంకోవైపు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014, 2019లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు […]
మాజీ సీఎం నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారారు. వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2004-2014లోపల చీఫ్‌విప్, స్పీకర్, ఉమ్మడి ఏపీకి చిట్టచివరి సీఎంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి దెబ్బతిన్నాక అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన సభకు మాత్రమే […]
బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేయాలని చూస్తోంది. ఇందు కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొనే పనిలో పడింది. వివిధ సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది ఢిల్లీ నాయకత్వం. పార్టీ పదవుల్లో ఇప్పటికే పెద్దపీట వేసింది. మోడీ సర్కార్‌లో కిషన్‌రెడ్డికి కేబినెట్ పదవి ఇచ్చింది. బండారు దత్తాత్రేయను గవర్నర్‌ను చేసింది. ఇదే కోవలో మరికొన్ని పదవులు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్న ప్రచారం కాషాయ శిబిరంలో […]
గన్నవరం వైసీపీలో వేడి తగ్గటం లేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య సెగలు ఓ రేంజ్లో రాజుకున్నాయి. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వంశీ. గత ఎన్నికల వరకు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా వ్యవహరించిన దుట్టా వర్గానికి వంశీ రాక ఇబ్బందిగా మారింది. 2014లో వంశీపై పోటీ చేసి దుట్టా 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. […]
ఆ మధ్య వచ్చిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘హుషారు’ చక్కని విజయాన్ని అందుకుంది. అందుకే కావచ్చు ఇప్పుడు నిర్మాత పి.ఎస్.ఆర్. కుమార్ (వైజాగ్ బాబ్జీ) తన చిత్రానికి ‘షికారు’ అనే పేరు పెట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్, నవకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు హరి కొలగాని ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం అందించారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. […]
తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావులను వైసీపీ ఎంపిక చేసింది. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. విజయసాయి రెడ్డి […]
కంచర్ల భూపాల్‌రెడ్డి.. కంచర్ల కృష్ణారెడ్డి. టీఆర్ఎస్లో కంచర్ల బద్రర్స్‌గా ఫేమస్. వీరిలో భూపాల్‌రెడ్డి ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోదరులిద్దరూ ప్రస్తుతం చర్చగా మారారు. వారి దూకుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కలవర పెడుతుందట. నకిరేకల్, మునుగొడు నియోజకవర్గాలను నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ నేతలకు తలనొప్పిగా మారినట్టు చర్చ నడుస్తోంది. కార్యకర్తల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారట. దీంతో ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయట. కంచర్ల బ్రదర్స్ స్వస్థలం […]
నెల్లూరు నగరానికి చేరువలో ఉన్న నియోజకవర్గం కోవూరులో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇక్కడ టీడీపీ నేతల కదలికలు జోరందుకున్నాయి. గత ఎన్నికలలో ఓడిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. 2019లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి డీలా పడిన మరో టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి సైతం ఈసారి పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా […]
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాబోదనే నినాదంతో కేడర్‌లో చురుకుపుట్టించే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. పార్టీ అగ్రనేతల రాక కూడా కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు. అయితే పైకి గంభీరంగా ఉన్నా బీజేపీ విస్తరణ.. సంస్థాగతంగా బలోపేతం అయ్యే విషయంలో నేతల మాటలకు.. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పనులకు అస్సలు పొంతన కనిపించడం లేదట. ఇందుకు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై తీసుకుంటున్న శ్రద్ధ ఏ పాటిదో.. అందులోని […]
యువీ రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు. యలమంచిలి ఎమ్మెల్యే. ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీ కీలక నేతల్లో ఒకరు. కుండబద్దలు కొట్టేసినట్టు మాట్లాడే ఆయన వైఖరి సొంత పార్టీని, యంత్రాంగాన్ని ఇబ్బందులోకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ క్షత్రియ సామాజికవర్గానికి బలమైన ఓటు బ్యాంకు లేనప్పటికీ 2004-2014మధ్య వరసగా రెండుసార్లు కాంగ్రెస్ నుంచి.. 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారే మధ్యలో టీడీపీ కండువా కప్పుకొన్నా.. అంతర్గత కారణాలతో అక్కడ ఎక్కువ కాలం […]