కర్నాటకలో జరిగిన రెడ్డి సామాజికవర్గం సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూ కాంగ్రెస్‌లో చర్చతోపాటు రచ్చ రచ్చ అవుతోంది. రెడ్లకు పగ్గాలు అప్పగించాలన్న ఆయన కామెంట్స్‌పై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా స్పందించిన వీ హన్మంతరావు PACలో చర్చిస్తామని ప్రకటించారు. VH లోలోన రగిలిపోతున్నా… పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దన్న రాహుల్‌గాంధీ సూచనలతో వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ […]
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగుచెయ్యడానికి, వారీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ […]
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీజేపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రెండు వర్గాలకు చెందిన నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డున పడటం చర్చగా మారింది. గోపన్‌పల్లి రహదారిపై ఘర్షణకు దిగడంతో పార్టీలోని అంతర్గత విభేదాలు అందరికీ తెలిసిపోయింది. అసెంబ్లీ బీజేపీ ఇంఛార్జ్ గజ్జెల యోగానంద్‌తో సహా పలువురు నాయకులు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డితో జరిగిన వాగ్వాదం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గం బీజేపీలో మూడు గ్రూపులు […]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. రాహుల్‌గాంధీ సభ తర్వాత దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్. బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనిలో గట్టిగానే పావులు కదుపుతోంది అధికార టీఆర్ఎస్. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని టీఆర్ఎస్ పెద్దల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత 20 రోజులుగా ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనిలో […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2024 టార్గెట్‌గా కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీల వ్యూహాలతోపాటు మాజీ ఐపీఎస్ వి.వి.లక్ష్మీనారాయణ కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన తరుఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజాసేవకుడిగా మారతానని “బాండ్ పేపర్” రాసిచ్చినా ఆయన్ని జనం ఆదరించలేదు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రైతు […]
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రొటీన్‌కు భిన్నంగా సాగింది. కర్నూలు సమావేశంలో పార్టీ కేడర్ స్పందన, రోడ్ షోలకు లభించిన ఆదరణకు ఫుల్ ఖుషీ అయ్యి కీలక ప్రకటన చేశారు. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. బాబు నోటి వెంట ఈ ప్రకటన రాగానే పార్టీ శ్రేణులు నివ్వెర పోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించిన ఉదంతాలు లేకపోవడంతో అది చర్చగా మారింది. దీని వెనక టీడీపీ వ్యూహం […]
తెలంగాణ కాంగ్రెస్‌లో వలసల స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఆయన భార్య కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కానీ.. ఎప్పటి నుంచో వస్తారు.. వస్తారు అని ప్రచారం జరిగిన ధర్మపురి శ్రీనివాస్ పరిస్థితి మాత్రం కొలిక్కి రావడం లేదు. ఆయన వస్తున్నారా? ఆగిపోయారా? అనేది ఎటూ తేలలేదు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా… సోనియాగాంధీని కలిసి పార్టీలోకి వస్తా అని చెప్పారు DS. ఆయన విన్నపానికి మేడం క్లియరెన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అప్పట్లో పీసీసీ […]
కరోనా కల్లోలమో, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమో, రెండూ కలిసి దరువేశాయోగానీ, ధరల మోత సామాన్యుల బతుకులను బండకేసి బాదింది, బాదుతోంది. ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పైపైకి ఎగబాకుతోంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ కామన్ మ్యాన్ కష్టాల రాగం ఆలపిస్తున్నాడు. ఇలా రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టైంలో, కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ రిలీఫ్ ఇచ్చింది. పేస్ట్ నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని ధరలు ప్రభావితమయ్యే పెట్రో రేట్లను కూసింతో, కాసింతో తగ్గించింది. లీటర్ […]