విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా బాగుండాలి అనేది తమ కోరిక అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు.. 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరిచారు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని.. రేపు మధ్యాహ్నం న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని తెలిపారు.. ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం? […]