ప్రపంచ కుబేరుడి స్కెచ్చేంటి?ట్విట్టర్ డీల్ వెనుక లక్ష్యమేంటి?లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజమెంత ?
ఎలాన్ మస్క్.. మామూలోడు కాదు..ప్రపంచ కుబేరుడిగా ఎదిగేంత వరకు నిద్రపోలేదు..కొత్త కొత్త ప్రాజెక్టులతో సంచలనంగా మారతాడు.పెట్టుబడులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు..చివరికి చెప్పేదొకటి చేసేదొకటి అనిపించుకుంటాడు..అసలు సిసలైన మాయగాడిగా నిలబడతాడు.కానీ, అసలు టార్గెట్ అమెరికా రాజీకీయాల్లో చక్రం తిప్పటమేనా?ఇదే ఇప్పుడు నడుస్తున్న చర్చ
చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేకపోవడం రాజకీయ నాయకుల లక్షణం.ప్రపంచ కుబేరుడిగా, సక్సెస్ ఫుల్ గా బిజినెస్ మ్యాన్ గా పేరున్న ఎలన్ మస్క్ లో ఈ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి.ట్విటర్ కు పోటీగా కొత్త ప్లాట్ ఫామ్ పెడతాననే ప్రకటన దగ్గర్నుంచీ..ట్విటర్ కొనుగోలు దాకా.. ఆయన నడిపిన హైడ్రామా అంతా ఇంతా కాదు.
ప్రస్తుతానికి ట్విట్టర్ డీల్ కొత్త మలుపులు తిరుగుతున్నా, చివరికి మస్క్ చేతికి ట్విట్టర్ రావటం మాత్రం ఖాయమనే భావిస్తున్నారు.
సౌతాఫ్రికాలో పుట్టి అమెరికా వలసొచ్చిన ఎలన్ మస్క్..2002లో యూఎస్ సిటిజన్ షిప్ తీసుకున్నారు.ఇలాంటి వ్యక్తి అమెరికా రాజకీయాలపై ఆసక్తి చూపుతారని ఎవరూ ఊహించలేదు.మస్క్ కూడా చాలాసార్లు తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నాడు.మై కెరీర్ ఈజ్ మార్స్ అండ్ కార్స్ అని ఓపెన్ గా ప్రకటించాడు.కానీ, చెప్పేదానికి చేసేదానికి పొంతన మాత్రం లేదనే చెప్పాలి
ప్రజల్ని ప్రభావితం చేసే కీలక అంశాలపైమస్క్ వ్యక్తం చేసే అభిప్రాయాలు చిత్రంగా ఉంటాయి.అమెరికా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల్ని వ్యతిరేకించే మస్క్..ఆ సబ్సిడీలను క్యాష్ చేసుకునే తన కంపెనీల బిజినెస్ పెంచుకున్నారు.
ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు, పనులకు ఎలన్ మస్క్ కేరాఫ్ అడ్రస్.కానీ మస్క్ లో అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశ ఉందని..అందుకే ప్రజాభిప్రాయాల్ని ప్రభావితం చేసే పబ్లిక్ షేరింగ్ ప్లాట్ ఫామ్ ట్విటర్ పై కన్నేశాడనే వాదనలు చాలాకాలంగా ఉన్నాయి
కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ పెంచుకున్న ఎలన్ మస్క్..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు..అసలే సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్..స్పేస్ ఎక్స్, టెస్లా, ఇప్పుడు ట్విట్టర్. కంపెనీలకు అధినేత. అన్నిటికీ మించి ప్రపంచ కుబేరుడు..దీంతో ఆయన మాటలకుండే విలువ తక్కువేం కాదు..సోషల్ మీడియాలో వీర ఫాలోయింగ్ ఉన్న మస్క్‌అమెరికా అధ్యక్షుడి నుండి, రష్యా పుతిన్ వరకు ఎవర్నీ వదలకుండా కామెంట్ చేసే మస్క్ వ్యవహారం
తనకు ఎదురు లేదన్నట్టుగా కనిపిస్తుంది.
యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ స‍్తంభించిపోవడంతోఆదేశ ప్రజల్ని ఆదుకునేందుకు ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాడు.రష్యా దాడులతో చితికిపోతున్న ఉక్రెయిన్‌కు సహాయం అందించినటి నుంచి మస్క్ క్రేజ్ అమాంతంగా పెరిగింది.మస్క్ ని వైట్ హౌస్ లో కూర్చోబెడితే పోతుందని అమెరికన్లు భావించే రేంజ్ వచ్చేసింది.కానీ అమెరికా పౌరసత్వ నిబంధనల దృష్ట్యా మస్క్ కి అలాంటి ఛాన్స్ లేదు కానీ,
అమెరికన్లలో మస్క్ అలాంటి ఇమేజ్ తెచ్చుకోవటమే ఓ చర్చగా మారిందిమస్క్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిని చేద్దామనే స్థాయిలోట్విట్టర్‌లో చర్చ జరిగిందంటే ఆయన సాధించిన ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రాక్టికల్ గా మస్క్ వైట్ హౌస్ పీఠంపై కూర్చునే సీన్ లేదు కానీ…మస్క్ వ్యవహారశైలిని అర్థం చేసుకున్నవాళ్లు అనేక వాదనలు వినిపిస్తున్నాయి.బిజినెస్ మ్యాన్ గా ఎవరికీ అంతుచిక్కని వ్యూహాలు రచించే మస్క్..సాహసోపేత నిర్ణయాలకు కూడా ఎప్పుడూ వెనుకాడలేదు.చాలావరకు కీలక నిర్ణయాల విషయంలో చివరివరకూ గోప్యత పాటించడం మస్క్ కు అలవాటు.ఇప్పుడు రాజకీయాలపై కూడా అలాంటి ఆలోచన చేసే అవకాశం కచ్చితంగా ఉందంటున్నారుమస్క్ దగ్గర ఇప్పుడు కావాల్సినంత డబ్బు ఉంది.ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి కొత్తగా ట్విటర్ ను కొన్నాడు.
డబ్బు, ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే తర్వాతి అడుగు రాజకీయాలవైపే కదా అంటున్నారు..
రాజకీయ ఆకాంక్షలపై ఎలన్ మస్క్ బహిరంగంగా స్పందించకపోయినా..
మస్క్ మైండ్ గేమ్ వెనుక ఇలాంటి టార్గెట్ ఉందని మాత్రం భావిస్తున్నారు.
ఇవన్నీ ఓ పక్కనుంటే ఇప్పుడు ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి.మస్క్ ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సహాయకురాలితో.అసభ్యంగా ప్రవర్తించాడనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది.ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి
స్పేస్‌ఎక్స్ సెటిల్‌మెంట్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అసత్యాలు అంటూ ట్వీట్ చేశారు.
మస్క్ పై ఆరోపణలో నిజమెంత?కోట్లు కుమ్మరించి సెటిల్ చేసుకున్నాడా?2016లో ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలోతన సొంత సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగితో ఎలాన్ మస్క్ అసభ్యంగా ప్రవర్తించినట్లు
బిజినెస్ ఇన్‌సైడర్ కథనం వెల్లడించింది. ఫ్లైట్ ప్రైవేటు రూమ్‌లో బాధితురాలిని అసభ్యకరంగా తాకడంతోపాటు..
నచ్చిన విధంగా మసాజ్ చేస్తే ఓ గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని మస్క్ చెప్పినట్లు వివరించింది.
ఈ లైంగిక ఆరోపణలకు సంబంధించి 2018లో బాధితురాలికి రెండున్నరల లక్షల డాలర్లు చెల్లించి
ఈ వ్యవహారాన్ని స్పేస్‌ఎక్స్ సెటిల్ చేసుకుందని అమెరికా మీడియా చెప్తోంది.అయితే, తనపై చేస్తోన్న దారుణమైన ఆరోపణలు పూర్తి అవాస్తవమంటూ ఎలాన్ మస్క్ వరుస ట్వీట్‌లు చేశాడు.తనపై ఇటీవలికాలంలో రాజకీయ దాడులు ఎక్కువయ్యాయని రానున్న నెలల్లో ఇవి మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మస్క్ చెప్పిన కొద్ది రోజులకే ఈ
ఆరోపణలు రావటం ఆసక్తికరంగా మారింది.
ట్విటర్ ఒప్పందంలో జోక్యం చేసుకునేందుకు, రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేపడుతున్నారని మస్క్ అంటున్నాడు.తను ఇకపై డెమొక్రటిక్ పార్టీకి మద్దతు తెలపబోనని,
రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని చెప్తున్నాడు ఎలాన్ మస్క్..ఈ ఆరోపణలతో టెస్లా షేర్లు పతనం అయ్యాయి.
ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏవైనా మస్క్ వ్యవహార శైలిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.వరుసగా కంపెనీలు కొనటం, పెట్టుబడుల్లో సంచలనాలు నెలకొల్పటం..రాజకీయ ఆసక్తులను వెల్లడించటం లాంటి అంశాలు చూస్తే
ప్రపంచ కుబేరుడి తర్వాత టార్గెట్ ఏమిటా అనే ఆసక్తి అమెరికన్లలోనే కాదు..ఎలాన్ మస్క్ ని ఫాలో అయ్యే అందరిలో మొదలైంది.
ఎప్పటికప్పుడు కొత్త కబుర్లు చెప్తాడు..మాట తప్పుతూనే ఉంటాడు..అలాగని సక్సెస్ లు లేవని కాదు..
మస్క్ ని మించిన సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్ లేడనే చెప్పాలి.కానీ, సాధారణంగా ఓ బిజినెస్ మ్యాన్ ల వ్యవహారశైలి ఓ పద్ధతిలో ఉంటుంది.వ్యాపారం, ప్రణాళికలు, పెట్టుబడులు, ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునే ఇమేజ్..
ఇవన్నీ చాలామందిలో కనిపిస్తుంటాయి. మస్క్ మాత్రం దీనికి భిన్నం..చాలా మాటలు చెప్తాడు. వాటిలో కొన్ని మాత్రమే చేస్తాడు..అంతరిక్షమంటాడు..అయిదేళ్లలో మార్స్ పై అడుగుపెట్టాల్సిందే అంటాడు.అది జరుగుతుందో లేదో తెలియదు.. మొత్తంగా ఓ మాయగాడిగా కనిపిస్తాడు.
మొన్నటికి మొన్న కోకోకోలా కంపెనీ కొనేస్తానన్నాడు.పైగా ఈ సాఫ్ట్ డ్రింక్ లో ఒకప్పుడు కలిపిన కొకైన్ ని కూడా మళ్లీ కలుపుతానని ట్వీట్ చేశాడు..నిజానికి ట్విట్టర్ ని కొంటానని అయిదేళ్ల క్రితం ట్వీట్ చేశాడు..
అందరూ సరదాగా చేసిందే అనుకున్నారు..తీరా చూస్తే ఇప్పుడు ట్విట్టర్ మస్క్ చేతిలోనే ఉంది.ఆ లెక్కన చూస్తే కోకోకోలాని కూడా కొంటాడా అనే చర్చ కూడా నడిచింది.అయితే నిజంగా కోకో కోలాను కొనాలంటే 284 బిలియన్‌డాలర్లు కావాలి.మస్క్ సంపద మొత్తం దానికి చాలానే తక్కువగా ఉంది.ఈ కోలా సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు ట్విట్టర్ కొనుగోలులో మాత్రం అనేక ట్విస్టులకు కారణమౌతున్నాడు మస్క్.
ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినట్టే వెళ్లినా కొనుగోలు ప్రక్రియలో అనుకోని అవాంతరాలు వచ్చి పడుతున్నాయి.
కొనుగోలు ప్రక్రియను ముందుకు సాగనివ్వకుండా ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి.44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్న మస్క్.మూడు నెలల్లో కంపెనీ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడుఈ తరుణంలో ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు
ట్విట్టర్ యాజమాన్యం సూచించిన ఫేక్ అకౌంట్స్ లెక్కలపై అనుమానాలున్నాయన్నాడు మస్క్
పైగా ఈ అంశంపై ట్విట్టర్లో ఓ పోల్ కూడా కండక్ట్ చేస్తున్నాడు.
ఇక్కడే మరోవిషయం చెప్పుకోవాలి…భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లక్ష్యం కోసమంటూ ఏర్పాటైన ట్విటర్ ..
అడ్డగోలు నియంత్రణలతో దారి తప్పిందన్నది మస్క్ ప్రధాన ఆక్షేపణ.దాన్ని గాడిలో పెట్టేందుకే సొంతంగా కొనుక్కుని, ప్రైవేట్‌గా మారుద్దామనుకుంటున్నాడు.అయితే, ట్విటర్ గతంలోనే భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చే విషయంలో
అనేక ప్రయోగాలు చేసి, ఎదురుదెబ్బలు తిని, మనుగడ సాగించేందుకుప్రకటనల ద్వారా ఆదాయాలు సమకూర్చుకునే క్రమంలో నియంత్రణలు అమలు చేస్తోంది.దీంతో వివాదాస్పద ట్వీట్లు చేసే ట్రంప్ లాంటి ప్రముఖుల ట్విటర్ అకౌంట్లను కూడా రద్దు చేసేసింది.ఇక, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యం అంటూ ఊదరగొడుతున్న మస్క్ ..
తన వరకూ వస్తే ఏం చేస్తాడనేదానిపై ఆసక్తి ఏర్పడింది
ట్వీట్‌ను సవరించేలా ఎడిట్ బటన్ ఉండాలని మస్క్ ప్రతిపాదన2019 నుంచి ఆయన దీనికోసం పట్టుబడుతున్నాడు.
పైగా హానికరం, తప్పుడు సమాచారం పేరుతో ట్విటర్‌లో..ట్వీట్ లను నియంత్రిస్తున్నారని మస్క్ వాదించాడు..
ఈ రేంజ్ లో భావప్రకటన గురించి మాట్లాడే లాన్ మస్క్..తన ఉద్యోగులతో వ్యవహరించిన తీరుపై ఎన్నో ఫిర్యాదులున్నాయి.మొన్నటికి మొన్న ట్విటర్ డీల్ పూర్తికాకముందే ఇద్దరు సీనియర్ ఉద్యోగుల్ని అవమానించారనే వార్తలొచ్చాయిమస్క్ మొండిగా ఉంటాడని, తన వాదనను ఎవరు వ్యతిరేకించినా తట్టుకోలేడనే అభిప్రాయాలున్నాయి.
ఇలాంటి వ్యక్తి చేతిలో సోషల్ మీడియా వెళ్తే ఎలా ఉంటుందో ఊహించటం కూడా కష్టమే..
నిజానికి ఎలాన్ మస్క్ వ్యవహార శైలి ఎప్పుడు గమనించినా.అందులో నిలకడ లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది.
తనకు ఆటిజమ్ లాంటి న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు.ఈ సమస్య ఉన్న వ్యక్తులు సంచలన వ్యాఖ్యలు, సంచలన నిర్ణయాలు తీసుకుంటారు.దానికి తగ్గట్టుగానే మస్క్ ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగానే కనిపిస్తాయి.ఇంత రిస్క్ తీసుకుంటున్నాడేంటి అనుకునేలా చేస్తాడు..మస్క్ మాటలు వింటే ఇవన్నీ జరుగుతాయా పాడా అని కూడా అనిపిస్తుంది..
మెున్నటికి మెున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై పుతిన్ నాతో యుద్ధం చెయ్ అని కామెంట్ చేశాడు..
ఎక్కడ పుతిన్.. ఎక్కడ మస్క్..దేశాధినేత ఎక్కడ తానెక్కడ అనే స్పృహ లేకుండానే మాట్లాడతాడు ఎలాన్ మస్క్..
అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై కూడా విమర్శల విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు..
అతనికున్న ప్రత్యేక మానసిక స్థితి మస్క్ కమ్యూనికేషన్ పై ప్రభావం చూపుతోందనే వాదనలున్నాయి.
కొన్ని విషయాల్లో చాలా దూకుడుగా ఉండటం, ఆకస్మికంగా నిర్ణయాలను మార్చేసుకోవటం,
సోషల్ స్కిల్స్ లేకపోవటం లాంటి సమస్యలుంటాయటఅందుకే ఎలన్ మస్క్ ఎప్పుడు ఏ అంశంపై ఎలా స్పందిస్తాడో తెలియదంటారు..ప్రతి అంశం పైనా ఫస్ట్ స్పందన తనదే అయ్యుండాలని కోరుకునే మస్క్..
అసలు విషయంపై క్లారిటీ మాత్రం మిస్సౌతుంటారనే అభిప్రాయాలున్నాయి.
మస్క్ సంపద ప్రస్తుతం 220 బిలియన్ డాలర్ల వరకు ఉంది.న్యూరాలింక్, స్పేస్‌ఎక్స్, ది బోరింగ్ కంపెనీ, టెస్లాకు ఆయన చీఫ్‌గా ఉన్నారు.వీటిలో కొన్నింటిని ఆయన స్వయంగా ఏర్పాటు చేయగా, కొన్నింటికి సహ వ్యవస్థాపకుడిగా లేదా
ఇన్వెస్టరుగా చేరి తర్వాత పగ్గాలు చేపట్టారు.ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ ఏకంగా 687 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది.ఫోర్డ్, జనరల్ మోటార్స్ సంస్థల సంయుక్త విలువ కన్నా అధికం.అయితే, ట్విటర్ కు మస్క్ ఇచ్చిన డీల్ ఆషామాషీ వ్యవహారం కాదు.లాభాల్లో లేని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను.. మస్క్ ఎందుకు కొన్నాడనే పెద్ద ఎత్తున నడుస్తూనే ఉంది.ట్విటర్ ను కేవలం వ్యాపార దృక్పథంతో కొన్నాడా? లేక మస్క్ మార్క్ భావప్రకటన స్వేచ్ఛను అమలు చేస్తాడా?ఇవేవీ కాకుండా ఎవరికీ తెలియని మూడో కోణం కూడా ఉందా అనే చర్చ జరుగుతోంది.పబ్లిక్ కంపెనీగా ట్విట్టర్ ఇప్పటివరకు లెఫ్టిస్ట్ భావజాలానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.అందుకే ట్రంప్ లాంటి హైప్రొఫైల్ వ్యక్తుల్ని కూడా బ్లాక్ చేయగలిగింది.కానీ ఇప్పుడు మాయగాడు మస్క్ చేతిలో ప్రైవేట్ కంపెనీగా మారనున్న ట్విటర్..
ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కుందనే వాదనతో..ఇష్టారాజ్యపు విమర్శలు, విద్వేష భావజాలం వ్యాప్తికి మస్క్ అనుమతిస్తాడనే ఆందోళన వ్యక్తమౌతోంది.
ఎన్ని కామెంట్స్ వచ్చినా ఎలాన్ మస్క్ ఓ సక్సెస్‌పుల్ బిజినెస్ మ్యాన్..ఇందులో రెండో మాటకు తావు లేదు..
పదిహేడేళ్ల వయసు నుంచే రిస్క్ చేయడం మొదలు పెట్టాడు ఎలాన్ మస్క్.అపర కుబేరుడిగా అవతరించాడు.
ప్రపంచంలో ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు.స్పేస్ ఎక్స్ రాకెట్‌తో అంతరిక్షాన్ని తాకినంత ఈజీగా
గంటల వ్యవధిలోనే వాల్డ్ నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా రికార్డులు తిరగరాశాడు.సింపుల్‌గా చెప్పాలి అంటే.. ఎలాన్ మస్ ఒక సెకనుకు కోట్లు సంపాదిస్తున్నాడు..
ఎలాన్ మస్క్ వ్యక్తిగత ఆస్తులు ఇప్పటికిప్పుడు లెక్కేస్తే 200బిలియన్ డాలర్లకు పైగానే ఉంటాయి.ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే సున్నాలు లెక్కపెట్టుకోవాలంటే టైం పట్టేంత ఆస్తి ఇది.ఇంత సంపదను భూమ్మీద ఇప్పటి వరకు ఎవ్వరూ కూడబెట్టలేదు.ఇప్పట్లో ఎలాన్ మస్క్‌ను ఢీ కొట్టే శక్తి కూడా ప్రపంచ టాప్‌టెన్ కుబేరుల్లో ఇంకెవ్వరికీ లేదు.
ఎలాన్ మస్క్ ఆస్తులు ఈ స్థాయిలో పెరగటానికి కారణం టెస్లా కంపెనీ.20 ఏళ్ల క్రితం స్థాపించిన టెస్లా కంపెనీ ఇవాళ
మస్క్‌ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా సింహాసనం ఎక్కించింది.టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థ వ్యవస్థాపక సీఈవోగా ఉన్న ఎలాన్ మస్క్‌కి, ఆ సంస్థలో17శాతం వాటా ఉంది.ఈ సంపదతో అమెజాన్ జెఫ్ బెజోస్ ని, గూగుల్ లారీ పేజ్ ని,
ఫేస్ బుక్ జుకర్ బర్గ్ ని దాటుకుని ఎక్కడికో వెళ్లిన ఎలాన్ మస్క్.. అపర కుబేరుడయ్యాడు.
మస్క్ మానస పుత్రికల్లో ఒకటి టెస్లా.రాకెట్ల వ్యయాన్నే తగ్గించాలనుకున్న తను కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదు అని నిర్ణయించుకున్నారు.2004లో టెస్లా విద్యుత్ కార్ల తయారీని మొదలు పెట్టాడు.
2008లో టెస్లా మూతపడే స్థాయికి వచ్చింది.అప్పుడు తన దగ్గరున్నదంటా పెట్టుబడిగా పెట్టారు.
టెస్లా తయారు చేసిన రోడ్ స్టార్ కారు మార్కెట్లో హిట్టు కొట్టడంతో ఇప్పటి వరకు టెస్లా వెనుతిరిగి చూడలేదు.
టెస్లాతో పాటు ఎలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్ సంస్థ కూడా ఉంది.
టెస్లాకు ముందే అంటే 2002లోనే స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు ఎలాన్ మస్క్.
125 బిలియన్ల ఈ కంపెనీ ప్రపంచానికి మార్స్ కలలను పెంచుతోంది.
అయిదుపదుల వయస్సు దాటిన మస్క్..ఎందరో దిగ్గజాలను కిందికి నెట్టి పైకి ఎలా ఎగబాకాడు అంటే, కేవలం పట్టుదల మాత్రమే.వాల్డ్ నెంబర్ వన్ కుబేరుడివి నువ్వే అని తెలిసిన వెంటనే ఎలాన్ మస్క్ పార్టీ చేసుకోలేదు.
ఎంత విచిత్రం.. అంటూ ఓ చిన్న ట్వీట్ చేశాడు.కొద్ది సేపటికే సరే! మళ్లీ పనిలో పడదాం అని ఇంకో ట్వీట్ చేశారు.
అంగారకుడి పైన మానవుడి జీవనాన్ని సాధ్యమయ్యేలా చేయడం మనోడి లక్ష్యం.
ఇందుకోసం రాకెట్లు కొనేందుకు రష్యా వెళ్లిన మస్క్‌ను అక్కడ అవమానాల పాలయ్యారు.
అప్పుడే సొంతంగా రాకెట్లు తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అంగారకుడిని చేరుకోవాలి అంటే రాకెట్లను చాలా తక్కువ ధరకు తయారు చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు.
100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 2002లో స్పేస్ ఎక్స్‌ను ప్రారంభించి రాకెట్ల తయారీ మొదలు పెట్టాడు.
తన ఆస్తిలో సగం భూమి మీద ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడాలని అని చెప్పుకునే మస్క్
భూమికి ఏదైనా ప్రమాదం జరిగి.. నాశనమైపోతే,
అంగారక గ్రహం మీద జీవితం కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి మిగతా సగం ఆస్తి సహాయపడాలంటాడు..
అంగారకుడిపైన మానవ స్థావరాలను ఏర్పాటు చేయడానికి తన సంపదనంతా ఖర్చు చేస్తానని చెబుతున్నాడు.
భూమిని దాటి మనిషి మరింత ముందుకు వెళ్లాలని, మార్స్‌లో మనుషులు బతకాలని,
చంద్రుడిపైన స్థావరం ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకునే మస్క్.. తన లక్ష్యం డబ్బు సంపాదన కాదంటాడు..
ఎలక్ట్రిక్ కార్ల తయారీతో విప్లవం, మార్స్ ప్రాజెక్ట్, సూపర్ ఫాస్ట్ రైళ్ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ లో పెట్టుబడులు
భూమి అట్టడుగు పొరల్లో చమురు గ్యాస్ క్షేత్రాలపైన పరిశోధనలు ఇవన్నీ మస్క్ దూసుకుపోతున్న రంగాలు..
ఎలాన్ మస్క్‌కు ఇప్పుడు మూడు దేశాల పౌరసత్వాలున్నాయి.ఒకటి తను పుట్టిన దక్షాణాఫ్రికాలో ఉంటే, రెండు తన తల్లి స్వస్థలం కెనడాలో ఉంది.ఇప్పుడు దిగ్గజ వ్యాపార వేత్తగా అమెరికాలోనూ మస్క్‌కు పౌరసత్వం ఉంది.కానీ, ఇది అమెరికా అధినేత కావటానికి మాత్రం పనికొచ్చేది కాదు.చేయాలనుకున్నది చేసేస్తాడని మస్క్‌పైన అందరికీ ఉన్న అభిప్రాయం..
కానీ, ఇది అంత సూటిగా లేకపోవటమే అతణ్ని మాయగాడిగా భావించేలా చేస్తోంది.సోషల్ మీడియాలో మస్క్ చేసిన కామెంట్స్ అనేక సార్లు వివాదాస్పదమయ్యాయి.లాక్‌డౌన్‌లో టెస్లా కార్ల కంపెనీ మూసేయాల్సి వచ్చినపుడు మస్క్ స్పందన వివాదాస్పదమైంది.కోవిడ్‌కు భయపడటం బుద్ధిహీనం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మస్క్.
ఓ టైమ్ లో ఆస్తులను అమ్మేసి భారాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నట్టు చెప్పిన మస్క్ అన్నట్టుగానే క్యాలిఫోర్నియాలో ఉన్న ఏడు భవంతులను అమ్మేశాడు.చివరికి టెక్సస్ లో సింపుల్ గా బతుకున్నాడు..ఇక్కడితో ఆగకుండా, బిట్ కాయిన్‌లో సడెన్‌గా భారీగా పెట్టుబడులు పెట్టాడు ఇలా అదీ ఇదీ అని కాకుండా అన్నీ తనకే కావాలనే ఎలాన్ మస్క్..
కొంత కాలంగా రాజకీయాలపై కూడా కామెంట్స్ మొదలు పెట్టాడు..దేశాధ్యక్షులనే టార్గెట్ చేస్తున్నాడు..
ఈసారి తన ఓటు రిపబ్లికన్లకే అంటున్నాడు..ఎలక్ట్రిక్ కార్ల పన్నుల విధానం విషయంలో బైడెన్ ప్రభుతాన్ని తప్పుబడుతున్నాడు
ఇలాంటి మనసత్తత్వం ఉన్న మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లటం ఆసక్తికరం..ఉద్యోగుల భావ ప్రకటన స్వేచ్ఛను సహించని మస్క్..సాధారణ ప్రజానీకం విషయంలో సహనం చూపుతాడా అనేది పెద్ద ప్రశ్నే..అసలు మీడియాని గుప్పిట్లో పెట్టుకుని మస్క్ ఏం సాధించాలనుకుంటున్నాడనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.మస్క్ ట్విటర్ ను నేరుగా తన రాజకీయ ఆకాంక్షల కోసం వాడుకోకపోయినా..పదవిలో ఉన్న నేతల్ని బ్లాక్ మెయిల్ చేసే సాధనంగా ఉపయోగిస్తాడా అనే అనుమానాలు వ్యక్తం చేసే వాళ్లూ ఉన్నారు..ఈ తరుణంలోనే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం..
డబ్బుతో నోరునొక్కేసి చేతులు కడుక్కున్నాడనే విమర్శలు రావటం ఆసక్తికరంగా మారింది..మొత్తంగా ప్రపంచ కుబేరుడిగా మారిన మాయగాడి అసలు లక్ష్యమేమిటనే ఆసక్తి అందరిలో ఉంది..