Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Has Revenge Opened Up To Politics In The Ruling Party

YCP : అధికార పార్టీలో రివెంజ్ పాలిటిక్స్ కు తెరలేచిందా.?

Published Date - 12:02 PM, Sat - 21 May 22
By Sista Madhuri
YCP : అధికార పార్టీలో రివెంజ్ పాలిటిక్స్ కు తెరలేచిందా.?

గడిచిన రెండు ఎన్నికలలోనూ వైసీపీకి ఉమ్మడి విజయనగరం జిల్లా ఏజెన్సీలో తిరిగులేని మెజారిటీని అందించారు జనం. ఇప్పుడు సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ సెగ్మెంట్లను కలుపుతూ కొత్తగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. ఆ హోదాలో జిల్లా కేంద్రంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు కూడా. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముంచేశారు. అంతా కలిసి సాగుతారు అని అనుకుంటున్న తరుణంలో నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఫ్లెక్సీల్లో మంత్రుల ఫొటోలు లేవట. గతానుభవాలను దృష్టిలో పెట్టుకునే ఇలా చేశారని చెవులు కొరుక్కున్నాయి పార్టీ శ్రేణులు.

పార్వతీపురం మన్యం జిల్లా విభజనకు ముందు కాస్తో కూస్తో ఉన్న విభేదాలు.. ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతకుముందు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రి బొత్స సత్యనారాయణ అండర్‌లో ఉండేవారనే టాక్‌ ఉంది. విభేదాలున్నా బయట పడేవి కాదు. తాజాగా ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పుష్పశ్రీవాణి తమను పట్టించుకోలేదని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు అనుచరులు బాహాటంగానే తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇటీవల పార్టీ మీటింగ్‌ కోసం జోగారావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పుష్పశ్రీవాణి ఫొటోలు పెట్టలేదు. సమావేశంలోనూ గ్యాప్‌ పాటించారట. పుష్పశ్రీవాణి వర్సెస్‌ జోగారావు వార్‌ ఇంకా కొనసాగుతోందని కేడర్‌కు అర్థమైపోయింది.

డిప్యూటీ సీఎం రాజన్నదొరతోపాటు పాలకొండ ఎమ్మెల్యే కళావతి.. ఎమ్మెల్సీ విక్రంత్‌ కూడా తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ మధ్య ఉన్న విభేదాలను నర్మగర్భంగా మీటింగ్‌లో బయట పెట్టేశారు. రాజన్నదొర సైతం సమావేశానికి సహకరించ లేదట. గతంలో రాజన్నదొరని అన్నివిధాలా శ్రీవాణి అవమానించారని.. అందుకే ఇప్పుడు ఆయన కూడా అదే పనిచేస్తున్నారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.

దీంతో మన్యం జిల్లా వైసీపీలో విభేదాలు మరో రూపంలో బుసలు కొడుతున్నాయని చర్చ జరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటిని గమనించిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పెద్దరికం పాత్ర పోషిస్తారని.. అన్నీ చక్కదిద్దుతారని కేడర్‌ భావిస్తోందట. ఈ లోగా రివేంజ్‌ పాలిటిక్స్‌ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

 

  • Tags
  • botsa satyanarayana
  • palakonda mla kalavathi
  • pushpa srivani
  • Rajana Dora
  • ycp

RELATED ARTICLES

YSRCP: అధికార పార్టీలో ఉన్న ఆ అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి గిట్టదా..?

YCP : ఎమ్మెల్యే రాపాక వైఖరి నచ్చక పార్టీ లీడర్స్ జంప్..?

TDP : ఏపీలో హౌస్ అరెస్టులపై టీడీపీ రివర్స్ అటాక్..?

TDP : పెందుర్తిలో వైసీపీ, టీడీపీ నేతల ఎత్తుగడలు..? |

BJP : ఏపీ బీజేపీ మాజీ చీఫ్ దారెటు.?కేడర్ ఆయనపై అసంతృప్తిగా ఉందా.?

తాజావార్తలు

  • Sravana Bhargavi-Hema Chandra: విడాకుల రూమర్‌పై స్పందించిన సింగింగ్ కపుల్

  • Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..! ఈసారి పక్కా..?

  • AB Venkateswara Rao: నా సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తా

  • Thailand: రెండు సూట్‌కేసుల్లో 109 సజీవ ప్రాణులు.. ఇద్దరు ఇండియన్స్ అరెస్ట్

  • Kamal Haasan: ‘విక్రమ్’ ఓటీటీ డేట్ లాక్

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions